AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రారంభ తేదీ? కావాల్సిన పత్రాలు ఇవే
AP Free Bus Scheme | ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నది. ఏపీఎస్ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం అమలు విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులు తమ నివేదికను అందజేశారు.
తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తీరును అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు సౌకర్యం నిబంధనలపై ప్రభుత్వం చర్చించనుంది.
అధికారిక వర్గాల ప్రకారం, APSRTC నెలకు దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎదుర్కొంటుంది. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా. ఎంపిక చేసిన కేటగిరీ సర్వీసుల్లోనే ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకాన్ని విజయవాడ, విశాఖపట్నంలలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సిటీ బస్సు సర్వీసులకే పరిమితం చేయాలని అధికారులు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు ప్రస్తుతం ఉన్న 70 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని కూడా వారు అభిప్రాయపడ్డారు.
ఉచిత బస్సు అర్హత ప్రమాణాలు :
- ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తూ ఉండాలి. భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి.
- ఏదైనా ప్రభుత్వం ద్వారా పొందిన ఫోటో ఆధారిత ఒరిజినల్ ID కార్డు ఉండాలి.
- తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. పురుషులకు ఈ పథకం వర్తించదు.
AP Free Bus Scheme ఈ ఉచిత బస్సు పథకాన్ని మొదటిగా విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వం వైస్సార్సీపీ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. కానీ ఆ విలీనం పూర్తిగా జరగలేదు, అయితే ఇప్పుడు ఆ భాద్యత ప్రస్తుత ప్రభుత్వం తీస్కొని విలీనం చేస్తూనే, ఈ పథకాన్ని అమలు చేయడానికి పనులు జరుగుతున్నాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..