Lok Sabha Elections | బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ
Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఢిల్లీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) ఈరోజు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ (Congress) మాజీ ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్‌లతో పాటు ఢిల్లీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ సమక్షంలో బీజేపీలో చేరారు.
గతంలో ఏప్రిల్ 28న Arvinder Singh Lovely కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో పొత్తు పెట్టుకోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు, కల్పిత, దురుద్దేశపూరిత అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకిస్తోందని, అయినప్పటికీ తమను సంప్రదించకుండా దేశ రాజధానిలో ఆప్‌తో పార్టీ పొత్తు పెట్టుకుందని లవ్లీ చెప్పారు. ఈశాన్య ఢిల్లీ నుండి కన్హయ్య కుమార్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుండి ఉదిత్ రాజ్ అభ్యర్థిత్వాన్ని లవ్లీ విమర్శించారు. కాంగ్రెస్‌కు వారు పూర్తిగా అపరిచితులని ఆయన అన్నారు. “నేను టిక్కెట్ల పంపిణీ విషయంలో మనస్తాపం చెందానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కానీ అందులో వాస్తవం లేదని అన్నారు.
#WATCH | After joining BJP, Arvinder Singh Lovely says, “I had resigned from the post of Delhi Congress President and after that, I met all my colleagues and thousands of Congress workers. All those people said that you should not sit at home and should continue fighting for the… pic.twitter.com/73hwB4cm8U
— ANI (@ANI) May 4, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..