Saturday, April 19Welcome to Vandebhaarath

Flipkart Big Billion Days Sale 2023.. అక్టోబర్ 8 నుంచి షురూ.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తోపాటు అన్నింటిపైనా భారీ డిస్కౌంట్లు..

Spread the love

దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) ప్రకటించింది. అయితే ఈ సేల్స్ బొనాంజా తేదీలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15న ముగుస్తుంది. Apple iPhone కొనుగోలుదారులు ఈ సేల్ కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఐఫోన్‌లను అత్యంత తక్కువ ధరకు లభించే సేల్స్ ఈవెంట్ ఇదే.. గత సంవత్సరం, Apple iPhone 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉండగా, ఈ సంవత్సరం, Flipkart సేల్స్ లో Apple iPhone 14తో పాటు iPhone 13ని నమ్మశక్యం కాని తగ్గింపుతో అందిస్తుందని భావిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమైనప్పటికీ, ఇకామర్స్ ప్లాట్‌ఫాం తన అధికారిక సైట్‌లో డీల్ ధరలను వెల్లడించడం ప్రారంభించింది. యాపిల్ ఐఫోన్ డిస్కౌంట్ వివరాలు అక్టోబర్ 1న వెల్లడికానున్నాయి.

ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు

2023 బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం Flipkart ICICI బ్యాంక్, Axis బ్యాంక్, Kotak బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ICICI బ్యాంక్, Axis బ్యాంక్, Kotak బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు వార్షిక విక్రయ సమయంలో 10% తక్షణ తగ్గింపును పొందగలుగుతారు. సాధారణంగా ఎంపిక చేసిన బ్యాంకులపై 10% ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,500కి పరిమితం చేయబడుతుంది.

READ MORE  రూ.6 వేల‌కే Moto G04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌..

50 నుంచి 80% శాతం డిస్కౌంట్లు

Paytm వినియోగదారులు UPI వాలెట్ లావాదేవీలపై కూడా కొంత డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టైంలో ఉన్న ఆఫర్లు ఏడాది మొత్తంలో మరే ఇతర రోజులో అందుబాటులో ఉండవు. అందుకు వినియోగదారులు ఈ సేల్ ఈవెంట్ కోసం తమకు కావాల్సిన వస్తువులను మరెక్కడా కొనకుండా వేచి ఉంటారు. ఈ డీల్స్‌లో ఎలక్ట్రానిక్స్, సంబంధిత ఉపకరణాలపై 50-80% తగ్గింపులు ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో ఉపకరణాలు, బొమ్మలు, లైఫ్ స్టైల్ ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు మరిన్ని వంటి ఉత్పత్తులపై ఆఫర్లు ఉన్నాయి.

READ MORE  Meta Rules | గుడ్ న్యూస్‌.. టీనేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఇక నియంత్ర‌ణ

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *