Vande Bharat Metro | మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?
Vande Bharat Metro | గుజరాత్‌లోని అహ్మదాబాద్ – భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధమైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబర్ 15న ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు ప్రధాన నగరాల మధ్య లోకల్ జర్నీని మరింత మెరుగుపరిచేందుకు వందేభారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
వారానికి 6 రోజులు
వందే భారత్ మెట్రో రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, ఇది భుజ్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 11:10 గంటలకు భుజ్ కు చేరుకుంటుంది. రైలు సబర్బతి, ఛందోయా, విరమ్‌గం, ధృంగధ్ర, హల్వాద్, సాంఖియాలి, భచౌ, గాంధీనగర్, అంజర్ అనే తొమ్మిది స్టేషన్‌లలో నిలుస్తుంది. ఈ దూరాన్ని దాదాపు 5 గంటల 45 నిమిషాల్లో సగటున 2 నిమిషాల స్టాప్‌లతో కవర్ చేస్తుంది.
భారతీయ రైల్వేల నెట్‌వర్క్‌లో ఈ వందే భారత్ మెట్రో ఇంటర్ సిటీ ప్రయాణాల కోసం తీసుకువస్తున్నారు. ఇది ఫుల్ ఎయిర్ కండిషనింగ్‌ను కలిగి ఉంది. 150 కి.మీ పరిధిలో నగరాలను కనెక్ట్ చేసేలా రూపొందించబడింది, ఇది వేగంతోపాటు అధునాత సౌకర్యాలతో అద్భుతమైన ప్రయాణ అనుభాన్ని అందిస్తుంది.
1,150 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 12 కోచ్‌లను కలిగి ఉన్న ఈ రైలు అనేక ఆధునిక సౌకర్యాలు సేఫ్టీ పీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా, ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి ఇది కవాచ్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు.
వందేభారత్ మెట్రో టికెట్ చార్జీలు
వందే భారత్ మెట్రో ఛార్జీలు సరసమైన ధరకు అందుబాటులో ఉన్నాయి, GSTతో సహా కనీస టిక్కెట్ల ధర ₹30 గా ఉండనున్నట్లు సమాచారం. సీజన్ టిక్కెట్ ఎంపికలు వరుసగా ₹7, ₹15, ₹20 ధరలతో వీక్లీ, బై-వీక్లీ, నెలవారీ పాస్‌లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రయోగం గుజరాత్‌లో ప్రయాణ అనుభవాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడానికి, ప్రాంతీయ రైలు సర్వీస్ కు కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేయడానికి తీసుకువస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..