Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్
ఫైర్-బోల్ట్ (Fire-Boltt ) కంపెనీ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్ (Fire-Boltt Phoenix
AMOLED Ultra Ace) ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ముఖ్య స్పెసిఫికేషన్లలో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ గేమ్‌లు, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మెటాలిక్ స్ట్రాప్, మూడు రంగులతో అందుబాటులో ఉంది. స్మార్ట్ వాచ్ బోట్, నాయిస్
వంటి బ్రాండ్‌తో పాటు ఇతర మోడళ్లతో పోటీపడుతుంది.
Fire-Boltt Phoenix AMOLED Ultra Ace స్పెసిఫికేషన్‌లు
కొత్త స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 700 నిట్‌ల మాగ్జిమమ్ బ్రైట్ నెస్, 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్
ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. వృత్తాకార స్క్రీన్ చుట్టూ మెటాలిక్ చట్రం ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లో మెటాలిక్ స్ట్రాప్ కూడా ఉంది. ఇది వాచ్ కు మరింత అందాన్నిస్తుంది.
వినియోగదారులు ఇన్‌బిల్ట్ స్పీకర్. మైక్రోఫోన్ సిస్టమ్‌తో బ్లూటూత్ v5.3 ద్వారా Fire-Boltt Phoenix AMOLED Ultra Ace నుండి
కాల్‌లు చేయవచ్చు అలాగే సమాధానం ఇవ్వవచ్చు. డివైజ్ డెడికేటెడ్ డయలర్ ఇంటర్‌ఫేస్‌ని, 10 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునే ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. ఇతర మోడల్‌ల మాదిరిగానే, పరికరం 10-మీటర్ల కనెక్టివిటీ పరిధిని అందిస్తుంది. యూజర్లు వాయిస్ అసిస్టెంట్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఎన్నో స్మార్ట్ ఫీచర్లు
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ అమోల్డ్ అల్ట్రా ఏస్ వాచ్ లో ఇన్‌బిల్ట్ వీడియో గేమ్‌లు, హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ కు సంబంధించి ఫైర్-బోల్ట్ హెల్త్ సూట్‌ను అందిస్తుంది. ఇది SpO2, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ నిద్ర ట్రాకింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది సెడెంటరీ, హైడ్రేషన్ రిమైండర్‌లను కూడా చూపుతుంది.
ఇతర ఫీచర్ల విషయానికొస్తే స్మార్ట్ నోటిఫికేషన్‌లు, అంతర్నిర్మిత వీడియో గేమ్‌లు, మ్యూజిజ్, కెమెరా కంట్రోల్స్, అలారం, టైమర్, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. కాగా దీని బ్యాటరీ లైఫ్ గురించి ఫైర్-బోల్ట్ ఎటువంటి వివరాలను పేర్కొనలేదు.
Fire-Boltt Phoenix AMOLED అల్ట్రా ఏస్ ధర
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్‌ను దాని వెబ్‌సైట్‌లో పరిచయ ఆఫర్‌గా రూ.2,499 కి అందుబాటులో ఉంది. కంపెనీ ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై 5% తగ్గింపుతో రూ. 2,374కు అందిస్తోంది. ఈ వాచ్ నలుపు, గోల్డ్, సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంది.
Electric Vehicles, సోలార్ ఎనర్జీ, పర్యావరణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.