గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు
అసలు కారణం ఏమిటీ?
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్నచేనును ఈ గేదె కొద్ది మొత్తంలో తినేసింది. దీంతో ఆ రైతు గేదెను ముళ్ల తీగతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు.
విషయం తెలుసుకున్నగేదె యజమాని సంతోష్ ఎలాగోలా తన గేదెను విడిపించుకున్నాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. తన గేదె మేత కోసం వెళ్తూ వినయ్ అనే రైతు తన పొలంలో మొక్కజొన్నను తినేసిందని చెప్పాడు. ఇది చూసిన వినయ్ కోపంతో గేదెను ముళ్ల తీగతో కట్టి కర్రలతో దారుణంగా కొట్టాడు. దీంతో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకుని తన గేదెను విడిపించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు.
ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు ఆరోపించినట్లు సమాచారం. దీంతో దిక్కుతోచని రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారుల ముందు తీవ్రంగా విలపించడం ప్రారంభించాడు. తన గేదె శరీరంపై ఉన్న గాయాలను చూపించాడు.‘నా గేదెకు ఏదైనా జరిగితే నేనెలా జీవించగలను.. ఇదే నన్ను బతికిస్తున్నది’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. కాగా న్యూస్ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. ప్రాణంగా చూసుకుంటున్న గేదెపై ఆ రైతు చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
न्याय मांगने भैंस लेकर कोतवाली पहुंचा किसान
भैंस के शरीर से खून निकलता देख फुट-फुट कर रोया
गांव के युवक पर लगाया भैंस को पीटने का आरोप#Buffalo #Farmer #ViralVideo @kannaujpolice pic.twitter.com/ls3RvHx8Xz— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) July 24, 2023