తాజా వార్తలుTelangana

Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Spread the love

Family Digital Card | రాష్ట్రంలోని ప్ర‌తీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పైలట్ ప్రాజెక్టు అమ‌లు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వ‌న్ డిజిటల్ కార్డ్` విధానాన్ని తెలంగాణ‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ల‌బ్ధిదారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతీఒక్కరి హెల్త్ పొఫైల్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ( Family Digital Card ) అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్‌కు జిల్లాల వారీగా ఒక వ్యవస్థ ఉండాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. రాజస్థాన్, హరియాణా,, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాల‌ని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మరికొన్ని వైద్యారోగ్య శాఖ కార్యక్రమాలపై సీఎం, మంత్రులు చర్చలు జ‌రిపారు. కాగా హెల్త్‌ కార్డు ప్రొఫైల్‌ కార్యక్రమం అనేది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స‌మయంలో కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని రేవంత్ ప్ర‌భుత్వం అమలు చేస్తుండడం విశేషం.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *