
EPF withdrawals: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ‘EPFO 3.0’ తో ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తోంది. ఇది PF డబ్బులను సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.చందాదారులు త్వరలో సాధారణ బ్యాంకు లావాదేవీల మాదిరిగానే ATM ల నుంచి మీరు నేరుగా ప్రావిడెంట్ ఫండ్‌ను డ్రా చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థను నగదు లావాదేవీలను సరళీకృతం చేయడానికి ప్రవేశపెతున్నట్లు పేర్కొన్నారు.
PFO తన చందాదారులకు బ్యాంకింగ్ లాంటి సౌలభ్యాన్ని తీసుకువచ్చే ‘EPFO 3.0’ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. “రాబోయే రోజుల్లో, EPFO 3.0 వెర్షన్ వస్తుంది. దీని అర్థం EPFO బ్యాంకులా మారుతుంది. లావాదేవీలు బ్యాంకులో నిర్వహించబడినట్లుగా, మీరు (EPFO చందాదారులు) మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) కలిగి ఉంటారు. ఈ నెంబర్ సాయంతోమీరు అన్ని పనులను చేయగలుగుతారు” అని మాండవియా అన్నారు.
EPFO 3.0 అనేది ప్రస్తుత వ్యవస్థకు సంబంధించిన లేటెస్ట్ వెర్షన్, ఇది నగదు విత్ డ్రా ప్రక్రియను వేగవంతం చేయడానికి, వినియోగదారునికి మరింత అనుకూలంగా చేయడానికి రూపొందించబడింది. ఈ అప్‌గ్రేడ్‌తో, EPFO సభ్యులు ఇకపై ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. అలాగే వారి PF డబ్బును యాక్సెస్ చేయడానికి వారి యజమానుల నుంచి ఆమోదాలు పొందాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు బ్యాంకు ఖాతా నుండి వేగంగా సులభంగా డబ్బులు డ్రా చేసుకున్నట్లే ATMల ద్వారా తమ నిధులను పొందవచ్చు.
సబ్‌స్క్రైబర్లు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉపయోగించి తమ ఖాతాలను నిర్వహించుకోగలుగుతారు. ATMల నుంచి PF ఉపసంహరణలకు ఏ పరిమితిని నిర్ణయించాలో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం, PF డబ్బును ఉపసంహరించుకోవడం అనేది పేపర్ వర్క్‌తో కూడుకున్నది. ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ EPFO 3.0 తో నిధుల ఉపసంహరణలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లు, పెన్షన్ బదిలీలను చాలా సరళంగా వేగంగా చేయవచ్చు.
ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి EPFO 3.0 యాప్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు, లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు. ఉపసంహరణలను సులభంగా చేయవచ్చు. ఈ ఖాతాల్లోని డబ్బు ఉద్యోగులదే కాబట్టి, అనవసరమైన ఆలస్యం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా దాన్ని యాక్సెస్ చేసుకునే స్వేచ్ఛ వారికి ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.