Posted in

Electricity Saving Tips : ఈ స్మార్ట్ గాడ్జెట్ల‌తో మీ క‌రెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు

Electricity Saving Tips
Electricity Saving Tips
Spread the love

Electricity Saving Tips | ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ ఇంటా క‌రెంటు వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో నెల‌వారీ విద్యుత్ బిల్లులు భారీగా వ‌స్తోంది. మీరు విద్యుత్ బిల్లులు ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని భావిస్తున్నారా ? కరెంటు వినియోగాన్ని అదుపులో ఉంచుకుని ఖర్చులు తగ్గించుకోవడంలో క్రమశిక్షణ పాటించండి . మీ ఇంటిలోని ప్రతి పరికరం ఎంత విద్యుత్ ను ఉపయోగిస్తుందో తెలుసుకోవడం వ‌ల్ల మీకు ఇంట్లో ఒక ఐడియా వ‌స్తుంది. దీని కోసం కొన్ని ఆధునిక గాడ్జెట్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

వైఫై స్మార్ట్ ప్లగ్‌లు

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అనేక ర‌కాల‌ WiFi స్మార్ట్ ప్లగ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో విద్యుత్ వినియోగాన్ని మానిట‌రింగ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. Hero Group Qubo, TP-Link, Wipro, Hawells, Philips వంటి అనేక ప్ర‌ముఖ‌ బ్రాండ్‌ల ఉత్పత్తులు చాలా త‌క్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.699 నుంచి 10A స్మార్ట్ ప్లగ్‌ని కొనుగోలు చేయవచ్చు. 16A ప్లగ్‌ రూ.899కి అందుబాటులో ఉంది.

మీరు స్మార్ట్ ప్లగ్‌ని సాకెట్‌లోకి ప్లగ్ చేసి, మీ స్మార్ట్‌ఫోన్‌లోని Qubo యాప్‌తో క‌నెక్ట్ చేయాలి. మీరు మీ మొబైల్‌లో విద్యుత్ ఖ‌ర్చ‌య్యే వివరాలను చూడవచ్చు. ఇప్పుడు మీరు బయట ఉన్నప్పుడు కూడా, మీరు ఇంట్లో పరికరాలను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ఇంటికి రాకముందే ఇంట్లో ఏసీ ఆన్ చేసి రెడీ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు 20 నిమిషాల పాటు బాత్రూమ్ గీజర్‌ని ఆన్ చేసేలా సెట్ చేసుకోవచ్చు. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు ఇంట్లో ఫ్రిజ్ ఆఫ్ చేయవచ్చు.

విప్రో స్మార్ట్ ప్ల‌క్‌

మీరు ఎక్కువ‌ ఎలక్ట్రికల్ డిజైజ్ ల‌ను కనెక్ట్ చేయాలనుకుంటే, మీరు విప్రో స్మార్ట్ ప్లగ్‌ను రూ.1890 ను కొనుగోలు చేయవచ్చు. 4 సాకెట్లతో కూడిన ఈ స్మార్ట్ ప్లగ్ ఎనర్జీ మానిటరింగ్, ఆటో కట్-ఆఫ్, షెడ్యూలింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో పరికరాలను నియంత్రించే ఫీచ‌ర్ ను కూడా కలిగి ఉంటుంది.

ఓం పాడ్‌

మీ విద్యుత్ వినియోగాన్ని నేరుగా మానిట‌రింగ్ చేసేందుకు మీకు సహాయపడే ఇత‌ర‌ పరికరాలు కూడా ఉన్నాయి. విద్యుత్ డిస్ట్రిబ్యూష‌న్ బాక్స్ (మెయిన్ బాక్స్‌) ఇన్స్టాల్ చేయగల గాడ్జెట్లు కూడా ఉన్నాయి. ఐఐటీ బాంబే, జస్ట్ ల్యాబ్స్ సంయుక్తంగా ఓమ్ అసిస్టెంట్ అనే గాడ్జెట్‌ను అభివృద్ధి చేశాయి. ఈ పరికరాన్ని ఓం పాడ్ అంటారు. ఓం అసిస్టెంట్ అనేది ఇళ్ల కోసం లైవ్ ఎనర్జీ మానిటరింగ్ పరికరం. కానీ, దీనిని ఎలక్ట్రీషియన్ లు మాత్ర‌మే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.

ఇంట్లో విద్యుత్ మెయిన్ బాక్స్ లో దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు వైఫై ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లో విద్యుత్ వినియోగ వివరాలను చూడవచ్చు. దీని కోసం ఓం అసిస్టెంట్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఉపయోగించవచ్చు.

Electricity Saving Tips ఇది కాకుండా, ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఉపయోగంలో లేనప్పుడు విద్యుత్తును ఉపయోగించలేవని చాలా మంది అనుకుంటారు. కానీ టీవీలు, కంప్యూట‌ర్‌ మానిటర్లు, UPS వంటి పరికరాలు ఉపయోగంలో లేనప్పుడు తక్కువ మొత్తంలో క‌రెంటును ఉపయోగిస్తాయి. ఇలాగే కొనసాగితే కొద్దికొద్దిగా విద్యుత్ వృథా అవుతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఉపకరణాలను వీలైనంత వరకు పవర్ సేవర్ మోడ్‌లో ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *