Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) తమకు ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ సరఫరా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేదని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ పరిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగకుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిపడింది. కాంగ్రెస్ ‘బెదిరింపుల దుకాణం’గా మారిందని విమర్శించింది. ‘మీ పనులు కావాలంటే నా తమ్ముడికి మాత్రమే ఓటు వేయాలని అని ఇటీవల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) వోటర్లను బెదిరించారని బీజేపీ అధికార ప్రతినిధి షేహజాద్ పునావాలా పేర్కొన్నారు.
వివాస్పద వ్యాఖ్యలు
రాజు కాగే వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన మారు పేరు. 2019లో రాజు కాగే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాజు కాగే మంగళవారం ఒక సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, మోదీ నినాదాలు ఇచ్చే కొందరు యువకులను విమర్శిస్తూ ‘ఒక వేళ రేపు మోదీ చనిపోతే? 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఇంకెవరూ ప్రధాని కాలేరా? దేశానికి ఆ సామర్థ్యం లేదా?’ అని అన్నారు. కాగా, రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ చనిపోవాలని కోరుకుంటుందా? అని కర్ణాటక బీజేపీ ఎక్స్ పోస్టులో ప్రశ్నించింది.
ఎన్నికల సంఘం నోటీసు
బెళగావిలోని మడబావిలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) కు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. నోటీసుపై స్పందించేందుకు ఆయనకు 24 గంటల గడువు ఇచ్చింది. కర్నాటకలోని బెలగావి జిల్లా మదభవి గ్రామంలో లోక్‌సభ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే ‘కరెంట్ కట్’ చేస్తామని ఓటర్లను బెదిరించారని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..