మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్‌ ఉందని మంత్రి కేటీ ఆర్‌ (KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. ఎలక్ట్రికల్‌ వాహన రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు ((E-Batteries)) దేశంలోనే తయారవుతాయన్నారు. గిగా కారిడార్ లో భాగంగా హైదరాబాద్ లోని జీఎంఆర్‌ ఏరో సిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నాని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric vehicles) కోసం జహీరాబాద్ పట్టణాన్ని ఎంపిక చేశామని తెలిపారు. యువ నైపుణ్యాలను ఒడిసిపట్టడంలో టీఎస్ ఐసీ కృషి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధన, డిజైనింగ్, ఇంజినీరింగ్‌ రంగాల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉందని చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ నిలుస్తోందన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న జయదేవ్‌ గల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతీరోజు కొత్తదనం ఉండేలా అమర రాజా కృషి చేస్తోందని కేటీఆర్ చెప్పారు. రెండు రోజుల క్రితమే కోల్డ్ చైన్‌ సెంటర్ ను ప్రారంభించుకున్నామని తెలిపా రు. ఎనర్జీ రీసెర్చ్‌ సెంటర్ ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

READ MORE  Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *