Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్ల (truck drivers) కు భారీ శిక్ష విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిమానాను భారీగా పెంచేశారు. ఒక వేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితిల్లో ప్రమాదం జరిగితే.. ఐపీసీ సెక్షన్ ప్రకారం గతంలో కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఈ కొత్త చట్టంలో జైలుశిక్షను పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదాలకు కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు.. ఈ కేసుల్లో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు భారతీయ న్యాయ సంహిత బిల్లు లో పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి ఘటన గురించి ఫిర్యాదు చేయకుంటే, అప్పుడు ఆ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. దీంతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించనున్నారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
అయితే Hit-And-Run Law కొత్త చట్టం క్రూరంగా ఉందని, భారీ వాహనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ట్రక్కుడ్రైవర్లు ఆరోపిస్తున్నారు. భారీగా జరిమానా వేయడాన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ వద్ద అంత భారీ మొత్తం ఎక్కడుంటుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాద సమయంలో గాయపడ్డ వారిని తరలించేందుకు యత్నిస్తే అప్పుడు అక్కడున్న జనం తమపై దాడి చేస్తున్నారని, ఇది చాలా ఆందోళనకరంగా ఉంటుందని నిరసనకారులు పేర్కొన్నారు. కాగా ట్రక్కు, ప్రైవేట్ బస్సు, గవర్నమెంట్ బస్సు, క్యాబ్ డ్రైవర్లు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..