Wednesday, April 1, 2026
Telangana

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

Spread the love

TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.

గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.

ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా సౌకర్యాన్ని కల్పిస్తోంది. బుకింగ్‌లు, తదుపరి సమాచారం కోసం, వినియోగ‌దారులు స్థానిక డిపో మేనేజర్‌ని సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ www.tgsrtconline.in ని సందర్శించవచ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *