Friday, April 11Welcome to Vandebhaarath

న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

Spread the love

ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాయింతా కాదు.. మిర్చి బజ్జీ, బోండా, సమోసా, ఇడ్లీ, చాట్స్ , భేల్ పూరీ, లాంటివి తినకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ఒక్కోసారి మిర్చి బళ్ల నుంచి వచ్చే ఘుమఘుమలు మనల్ని అటువైపు ఆకర్షిస్తాయి.  కానీ విక్రయదారులు పరిశుభ్రతలు ఏవీ పాటించకుండా వీధుల్లో ఈ తినుబండారాలు తయారు చేస్తారు.. ఆహారాన్ని తయారు చేసే విధానంపై మాత్రమే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే… తినుబండారాలను ఎలా వడ్డిస్తున్నారనేది కూడా చూడాలి.

FSSAI ఇటీవల చేసిన పరిశోధన గురించి వివరించింది. ఇది వార్తాపత్రికలో ఆహార పదార్థాలను చుట్టడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రింటింగ్‌లో ఉపయోగించే ఇంక్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయని తెలిపింది. ఆహారాన్ని పరిశుభ్రంగా వండినప్పటికీ, అలాంటి ఆహారాన్ని న్యూస్ పేపర్ లో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం” అని ఫుడ్, సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పేర్కొంది.”ప్రింటింగ్ ఇంక్‌లలో హానికరమైన రంగులు, పిగ్మెంట్‌లు, బైండర్‌లు కలిగి ఉండవచ్చు. రసాయన కలుషితాలతో పాటు, ఉపయోగించిన వార్తాపత్రికలలో వ్యాధికారక సూక్ష్మ జీవులు ఉండటం వల్ల కూడా మానవ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది”. రీసైకిల్ చేయబడిన కాగితంతో తయారు చేయబడిన కాగితం/కార్డ్‌బోర్డ్ పెట్టెలు కూడా థాలేట్ వంటి హానికరమైన రసాయనాలతో కలుషితమై ఉండవచ్చు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. తీవ్రమైన విషపూరితమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.

READ MORE  Cosmetology Institute | ఫ్యాష‌న్ ప్రియుల‌కు పండగే.. హైదరాబాద్‌లో కాస్మోటాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం..

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి కమల వర్ధనరావు కీలక హెచ్చరిక చేశారు. ఇటీవలి ప్రసంగంలో, ఆహార పరిశ్రమలో వార్తాపత్రికల వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

న్యూస్ పేపర్లు ఎందుకు ప్రమాదం..

ఇంక్ కాలుష్యం: వార్తాపత్రికలలో ఉపయోగించే సిరా (ఇంక్) లో ఆహారాన్ని కలుషితం చేసే బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుంది. ఈ బయోయాక్టివ్ పదార్థాలు ఆహారంలోకి ప్రవేశించగలవు. ఇవి తీసుకున్నప్పుడు  చర్మం దద్దుర్ల నుండి జీర్ణ సంబంధిత సమస్యల వరకు ఎన్నో  అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

READ MORE  Dates Benefits : రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

 రసాయన కూర్పు: ప్రింటింగ్ ఇంక్‌లో ఉండే రసాయనిక కూర్పు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా ప్రింటింగ్ సిరాలలో సీసం వంటి  హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఈ విషపూరిత పదార్థాలు శరీరంలోకి ప్రవేశించగలవు, శరీరంలో పేరుకుపోతాయి తీవ్రమైన దీర్ఘకాలిక రుగ్మతలను కలిగిస్తాయి. సీసం (లెడ్) ప్రత్యేకించి, దాని న్యూరోటాక్సిక్ ను కలిగిస్తుంది. దీనివల్ల పిల్లలలో ఎదుగుదల లోపిస్తుంది.  పెద్దలలో నరాల బలహీనత వచ్చే ప్రమాదముంది.

మరికొన్ని  సమస్యలు

జీర్ణశయ సమస్యలు: ఇంక్ జీర్ణవ్యవస్థను చికాకుపెడుతుంది, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు కలిగించవచ్చు.

చర్మ సమస్యలు : ఇంక్-ఎక్స్‌పోజ్డ్ ఫుడ్‌ను తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు వస్తాయి.

హెవీ మెటల్ పాయిజనింగ్: సిరాలో తరచుగా లెడ్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళితే.. పొత్తికడుపు నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

READ MORE  Honey Adulteration Test "తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీనా అని ఎలా కనిపెట్టాలి?"

ఫుడ్‌బోర్న్ ఇల్‌నెస్: ఇంక్ కలుషితాలు హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటంుది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కలిగించవచ్చు.

క్యాన్సర్ రిస్క్: కొన్ని సిరాలలో క్యాన్సర్ కలిగించే పదార్థాలు ఉంటాయి, కాలేయం, ఊపిరితిత్తులు, చర్మం, మూత్రాశయం తోపాటు మరిన్నింటితో సహా వివిధ క్యాన్సర్లను కలిగించే ప్రమాదం పొంచి ఉంది.

ఈ సమస్యలను పరిష్కరించడానికి, FSSAI చర్యలు చేపట్టింది. 2018 ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలను జారీ చేసింది. ఇప్పుడు ఆహార నిల్వ, ప్యాకింగ్ కోసం న్యూస్ పేపర్ల వాడకాన్ని నిషేధించింది. మీరు ఏదైనా తినేముందు పేపర్ లో కాకుండా ప్లేట్ ఇవ్వమని అడగండి..


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *