DIAL | జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికెట్ తొలి ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ విమానాశ్రయం..
న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), GMR ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DIAL) అనుబంధ సంస్థ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA) జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ హోదాను పొందింది. భారతదేశంలో ఈ హోదా దక్కించుకున్న మొదటి విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అవతరించింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఈ సర్టిఫికేషన్ ప్రకటించింది.
ముఖ్యాంశాలు:
పునరుత్పాదక శక్తి : DIAL విమానాశ్రయం ఎయిర్‌సైడ్ ఏరియాలో 7.84 MW సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఓపెన్ యాక్సెస్ ద్వారా అదనపు పునరుత్పాదక విద్యుత్‌ను అందిస్తుంది. విమానాశ్రయం ప్రస్తుతం పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేస్తుంది, సంవత్సరానికి సుమారు 200,000 టన్నుల CO2ను నివారిస్తుంది.
గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ : ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 LEED గోల్డ్, IGBC ప్లాటినం ధృవీకరణలను పొందింది. టెర్మినల్ 1, ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. 2023 చివరి నాటికి మొత్తం 7.64 లక్షల m² సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్ ఏరియాకు దోహదపడే LEED ప్లాటినం ప్రీసర్టిఫికేషన్‌ను కూడా పొందింది.
నీటి నిర్వహణ : 350కి పైగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఉన్నాయి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను కలిగి ఉంది. అలాగే ఎయిర్‌పోర్ట్ కోలాబరేటివ్ డెసిషన్ మేకింగ్ (A-CDM) సిస్టమ్ ఎయిర్ ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరిచింది. .
ఎలక్ట్రిక్ వాహనాలు, టాక్సీబాట్‌లు : ఢిల్లీ విమానాశ్రయంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు, టాక్సీబాట్ లే వినియోగింలో ఉన్నాయి. దీనివల్ల విమాన ట్యాక్సీ కార్యకలాపాల సమయంలో శిలాజ ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. కొత్తగా పనిచేస్తున్న ఈస్టర్న్ క్రాస్ టాక్సీ వే టాక్సీ సమయాన్ని తగ్గించింది, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఏటా సుమారు 55,000 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించింది.
ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ : ఢిల్లీ విమానాశ్రయం DIAL అనేది ISO 50001:2018 ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను స్వీకరించి ధృవీకరించిన ప్రపంచంలోనే మొదటి విమానాశ్రయంగా నిలిచింది. ఇది సంవత్సరాలుగా ఇంధనం విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..