Posted in

ధరణికి సర్కారు మంగళం.. ప్రభుత్వం కీలక ప్రకటన

Dharani Portal
Dharani Portal
Spread the love

Hyderabad : గత బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ‌(Dharani Portal) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో  త్వరలో ఆర్‌ఓఆర్‌ ‌చట్టాన్ని ( ROR Act)  తీసుకువస్తామని వెల్లడించింది. ఈమేరకు ధరణి పోర్టల్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా కొత్త చట్టాలన్ని అమల్లోకి తెస్తామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

దసరా లోపు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

రాష్ట్రలో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  ఇక, వెంటనే మరమ్మత్తులు మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని పొంగులేటి తెలిపారు.ఈనెల 7న తమ ప్రజా ప్రభుత్వం ఏర్పాడి 10 నెలలు పూర్తవుతుందని చెప్పారు. 10 నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేకపోయామని అభిప్రాయపడ్డారు. ..

త్వరలో స్మార్ట్ డిజిటల్ కార్డులు

రాబోయే రోజుల్లో తెల్ల రేషన్‌ ‌కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ ‌కార్డుతో అనుసంధానం చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.  ఈ దసరా లోపు స్మార్ట్ ‌కార్డులు ఇస్తామని, . అర్హతలకు స్మార్ట్ ‌కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి పేదలకు ఇళ్లు ఇస్తాం.  జనవరి నుంచి సన్న బియ్యం, ఆసరా పెన్షన్ల అందజేస్తాం. రుణమాఫీ కానీ రైతులకు రూ.13 వేల కోట్ల నిధులను  త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి  వెల్లడించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *