Delhi Water crisis | తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు
Delhi Water crisis | దేశ రాజధానిలో ఢిల్లీలో తాగునీటి కొరత ప్రజలను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం అందరూ అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక నెల పాటు అదనంగా నీటి సరఫరాను కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానిలో వేడిగాలుల పెరిగాయని, నీటి అవసరం కూడా గణనీయంగా పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. మండుతున్న వేడిలో దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.
హర్యానా అవసరమైనంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ మంత్రి అతిషి కేంద్రానికి లేఖ కూడా రాశారు. “దిల్లీ తన రోజువారీ నీటి డిమాండ్ కోసం యమునా నది నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే, హర్యానా వజీరాబాద్ బ్యారేజీని విడుదల చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా, వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్టాలు భారీగా తగ్గాయి. యమునా నదిలో అవసరమైన మొత్తంలో నీరు లేదని కేంద్ర జల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు రాసిన లేఖలో అతిషి పేర్కొన్నారు. “అంతేకాకుండా, ఢిల్లీలో ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీలకు చేరుకుంది. ఇది నీటి డిమాండ్‌ను మరింత తీవ్రం చేసింది,” ఆమె తెలిపారు.
ఢిల్లీలోని చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతం, గీతా కాలనీ ప్రాంతంతో సహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత నెలకొంది. కాలనీల్లో పెద్ద ఎత్తున ప్రజలు మండుటెండల్లో ట్యాంకర్ల కోసం వేచి చూస్తున్నారు. కనీసం ఒక బకెట్‌లోనైనా లభించకపోదా అనే ఆశతో ప్రజలు పొడవైన క్యూలలో నిరీక్షిస్తున్నారు.
నీటి వృధా చేస్తే ₹ 2,000 జరిమానా
దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ మార్కు దాటడంతో ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఢిల్లీలో కూడా బెంగళూరులో మాదిరిగా నీటి సంక్షోభం (Delhi Water crisis ) వచ్చింది. కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 2.8 డిగ్రీలు ఎక్కువగా ఉంది. దేశ రాజధానిలో హీట్‌వేవ్ పరిస్థితులు రాబోయే కొద్ది రోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలోకి ప్రజలు రావొద్దని, హైడ్రేటెడ్‌గా ఉండాలని ప్రజలకు సూచించింది. మరోవైపు AAP నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం నీటి వృధా చేసేవారిపై ₹ 2,000 జరిమానా విధించింది. నీటి వృథా చేయకుండా 200 బృందాలను ఏర్పాటు చేసింది.
In winters, Delhi people suffer from pollution.
In summers, Delhi people suffer from water shortage.
Kejriwal had promised to turn Delhi into London but he is actually turning Delhi into Baghdad. pic.twitter.com/HFJ7kcdf9i
— Trupti Garg (@garg_trupti) May 30, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..