
DUSU Elections | ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్రతిపాదనను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్, ఇతర సంబంధిత ప్రతివాదులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనియన్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తోందని పిటిషన్ వాదించింది.
డియుఎస్‌యు ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను మూడు వారాల్లోగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనివల్ల విద్యార్థి సంఘంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని, లింగ సమానత్వం, సమగ్రతను ప్రోత్సహిస్తుందని తెలిపింది.
సెప్టెంబర్ 27న DUSU ఎన్నికలు
DUSU Elections : 2024-25 విద్యా సంవత్సరానికి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు)కి ఎన్నికలు సెప్టెంబర్ 27న జరగనున్నాయి. నామినేషన్ సమర్పణకు సెప్టెంబరు 17 వరకు గడువు ఉంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవడానికి సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉంది. పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు ప్రచురించాల్సి ఉందని PTI నివేదించింది.
DUSU అంటే ఏమిటి?
DUSU అంటే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్. ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని అనేక కళాశాలలు, ఫ్యాకల్టీల నుంచి విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. . ప్రతి కళాశాలకు ప్రత్యేక విద్యార్థి సంఘం ఉంటుంది. ఈ విద్యార్థి సంఘానికి ఏటా ఎన్నికలు జరుగుతాయి. విశ్వవిద్యాలయం. దాని అనుబంధ కళాశాలల నుంచి విద్యార్థులు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ప్రతినిధులను ఎంపిక చేస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు – సెప్టెంబర్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..