Delhi Pollution | ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలు బంద్‌.. పూర్తిగా ఆన్‌లైన్ లోనే తరగతులు

Delhi Pollution | ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలు బంద్‌.. పూర్తిగా ఆన్‌లైన్ లోనే తరగతులు

Delhi Pollution | ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సీజన్‌లో అత్యధికంగా 494కి ఎగబాకింది. పాఠశాలలు. ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలల్లో ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల‌ను పూర్తిగా నిలిపివేసి ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.
జాతీయ రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్‌లు 500 మార్కు దాటి “ఆందోళనకరంగా” స్థాయికి చేరుకోవడంతో మొత్తం AQI ‘సివియర్ ప్లస్’ కేటగిరీలో కొనసాగింది.

READ MORE  దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మ‌రింత వేగంగా రోడ్డు ప్ర‌యాణాలు

ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌, అశోక్‌ విహార్‌, బవానా, జహంగీర్‌పురి, మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ స్టేడియంతో పాటు పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) మంగళవారం ఉదయం 5 గంటలకు 500 గంటలకు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది.

GRAP-IV ఆంక్షలు

దేశ రాజధానిలో ఇప్ప‌టికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 4 కింద కాలుష్య నిరోధక చర్యలను అమలు చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే తాజా రీడింగ్‌లు వచ్చాయి. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఎల్‌ఎన్‌జి, సిఎన్‌జి, బిఎస్-6 డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహ‌నాలు త‌ప్ప మిగ‌తా వాహాల‌ను వినియోగించొద్దు. ట్రక్కులు ఢిల్లీలోకి ప్రవేశించ‌కుండా అనుమతులు నిలిపివేశారు. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, విద్యుత్ లైన్లు, పైప్‌లైన్‌లు, ఇతర పబ్లిక్ ప్రాజెక్ట్‌లతో సహా అన్ని నిర్మాణ ప‌నుల‌ను కూడా నిలిపివేశారు.

READ MORE  India's first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..

కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నందున, జాతీయ రాజధానిలో ప్రభుత్వం బేసి-సరి వాహన నిబంధనలను కూడా అమలు చేసే అవ‌కాశం ఉంది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, ఇక్కడ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ చివరి అంకె ఆధారంగా రోడ్లపైకి అనుమతించనుంది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *