Sunday, March 9Thank you for visiting

Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి

Spread the love

Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును స్వయంగా మార్చుకున్నారు. గతంలో 6 తుగ్లక్ లేన్ అని రాసిన తన ఇంటి బోర్డును ఆయన 6 వివేకానంద మార్గ్ (Vivekananda Marg) గా మార్చారు.

దినేష్ శర్మకు 6, తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ నివాసం కేటాయించారు. ఇక్కడ, అతను తన కుటుంబంతో కలిసి తన నివాసంలో గృహ ప్రవేశ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

READ MORE  PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

తుగ్లక్ లైన్ నుంచి స్వామి వివేకానంద మార్గ్ గా.

ఎంపి అధికారిక నివాసం నేమ్ ప్లేట్ పై ‘స్వామి వివేకానంద మార్గ్’ అని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ గురువారం (మార్చి 6) పూజాకార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్లారు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చిత్రాలలో, అతను తన కుటుంబంతో కలిసి పూజలు చేసినట్లు ఫొటోలు షేర్ చేశారు. ఒక ఫోటోలో, అతని నివాసం బోర్డు కూడా వెనుకవైపు కనిపిస్తుంది. దానిపై ఎంపి పేరు, ఆయన నివాసం చిరునామా దాని కింద వ్రాయబడి ఉన్నాయి. ఆ రోడ్డు పేరు నేమ్ ప్లేట్ మీద స్వామి వివేకానంద మార్గ్ అని రాసి ఉంది. అయితే, తుగ్లక్ లేన్ (Tuglak Line) కూడా కింద చిన్న అక్షరాలతో రాయబడి ఉంది.

READ MORE  Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో

చిత్రాలను పంచుకుంటూ దినేష్ శర్మ ఇలా వ్రాశాడు, “ఈరోజు, నా కుటుంబంతో కలిసి, న్యూఢిల్లీలోని స్వామి వివేకానంద మార్గ్ (తుగ్లక్ లేన్)లో నా కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను ఆచారాల ప్రకారం పూజ హారతి నిర్వహించాను.” అని పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

READ MORE  వీడియో: పగిలిపోయిన మద్యం బారెల్.. వీధుల్లో నదిలా ప్రవహించిన రెడ్ వైన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు Adiyogi : ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం విశేషాలివే..