Delhi liquor policy : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ పార్టీని నిందితుడిగా చేర్చిన ఈడీ
Delhi liquor policy | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు ఈ ప్రకటన చేశారు . ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇది EDకి సంబంధంచి తొమ్మిదవ అనుబంధ ఛార్జిషీట్ అవుతుంది. ముందుగా చెప్పినట్లుగానే ఈ కేసులో ఆప్‌ని నిందితుడిగా పేర్కొననున్నట్లు ఈడీ.. ఢిల్లీ హైకోర్టుకు విన్నవించిన రెండు రోజుల తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది .
కేసులో కీలకాంశాలు
- ఈ కేసు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణకు సంబంధించినది.
- Delhi liquor policy కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీష్ సిసోడియా , ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు అగ్రనేతలను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి.
- కేజ్రీవాల్, సింగ్ ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నారు.
- ఎక్సైజ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బదులుగా కొంతమంది వ్యాపారవేత్తల నుండి 100 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
- 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ ఈ లంచాన్ని వినియోగించిందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
- తమకు అనుకూలంగా పాలసీని రూపొందించేందుకు లంచాలు చెల్లించిన మద్యం వ్యాపారులు, రాజకీయ నాయకుల ఆరోపణతో కూడిన “సౌత్ గ్రూప్” ప్రమేయం ఉందని ED ఆరోపించింది.
- దర్యాప్తు సంస్థ ప్రకారం, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఈ సౌత్ గ్రూప్ తో ఆమెకు సంబంధం ఉందని ఆరోపించింది.
- మే 2022లో ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల తర్వాత ఈ కేసుపై విచారణ ప్రారంభమైంది.
- కొత్త లిక్కర్ విధానంపై అనేక ఆరోపణలు రావడంతో జూలై 2022లో ఈ పాలసీని వెనక్కి తీసుకున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..