Wednesday, April 16Welcome to Vandebhaarath

Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Spread the love

Delhi Jama Masjid : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సంభాల్‌ (Sambhal)లోని జామా మసీదును హరిహర‌ దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టుల‌లో పిటిష‌న్లు వేసిన విష‌యం తెలిసిందే.. అయితే తాజ‌గా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిష‌న్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ భారత పురావస్తు శాఖ (ASI) జనరల్‌కు లేఖ రాశారు.

జామా మసీదు మెట్లపై కృష్ణుడి ఆలయ విగ్రహాల అవశేషాలు ఉన్నాయని హిందూ సేన‌ పేర్కొంది. ఔరంగజేబ్ నామా, సాకీ ముస్తాక్ ఖాన్ ఔరంగజేబుపై రాసిన ‘మసీర్-ఎ-ఆలమ్‌గిరి’ పుస్తకంలో తమ రుజువు రాసి ఉంద‌ని తెలిపింది. హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదును సర్వే చేసి, ఆ విగ్రహాలను బయటకు తీసి ఆలయాల్లో తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతోంది. దీంతో పాటు ఔరంగజేబు క్రూరత్వం, ఆలయ కూల్చివేత నిజానిజాలు ప్రపంచానికి వెల్లడవుతాయని తెలిపింది.

READ MORE  మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

జోధ్‌పూర్, ఉదయ్‌పూర్‌లలో కృష్ణ దేవాలయాలు

Jama Masjid News : జోధ్‌పూర్, ఉదయ్‌పూర్‌లోని కృష్ణ దేవాలయాలను ఔరంగజేబు కూల్చివేశార‌ని హిందూ సేన భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ఢిల్లీలోని జామా మసీదు మెట్లపై విగ్రహాల అవశేషాలు ఉన్నాయి. సాకీ ముస్తాక్ ఖాన్ రాసిన ‘మసీర్-ఏ-ఆలమ్‌గిరి’ పుస్తకంలో దీనికి నిదర్శనం. ఆదివారం (మే 24-25, 1689) ఖాన్ జహాన్ బహదూర్ దేవాలయాలను ధ్వంసం చేసి జోధ్‌పూర్ నుంచి తిరిగి వచ్చారని పుస్తకంలో రాయబ‌డి ఉంది. ఔరంగజేబు జీవిత చరిత్రలో ఖాన్ జహాన్ బహదూర్ దేవాలయాలను పడగొట్టాడని రాశారు. ఖాన్ జహాన్ బహదూర్ చేసిన ఈ పనికి ఔరంగ‌జేబు చాలా సంతోషించాడు. ఆ తర్వాత, విరిగిన విగ్రహాల అవశేషాలను ఎడ్ల‌ బండ్ల ద్వారా ఢిల్లీకి పంపించారు, అవి ఇప్పుడు జామా మసీదు మెట్లలో ఉన్నాయి.

READ MORE  Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని

ఈ పిటిషన్‌ను స్వీకరించి మూడు పక్షాలకు నోటీసులు పంపిన కోర్టు పెద్ద దుమారాన్ని రేపింది. మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమని ముస్లిం నేతలు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దేవాలయాలు, మసీదులకు సంబంధించి ఇలాంటి అనేక కేసులకు సంబంధించి ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది అజ్మీర్ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *