Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
Kejriwal : దిల్లీ మద్యం కేసులో దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ.. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా కూడా ఆయన హాజరు కాలేదు. ఓ కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్టు చేసిన తొలి రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్. ఇదే కేసులో ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
కేజ్రీవాల్ (Kejriwal ) ను రెండున్నర గంటల పాటు ఆయన నివాసంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా, ఆయన జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను స్థానిక న్యాయస్థానం ముందు హాజరు పరిచి రాత్రికి ఈడీ కార్యాలయానికి ఆయనను తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. కాగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్టు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ పేర్కొన్నారు. ఈ కేసులో 600 మందికి పైగా అరెస్ట్ చేశారని, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముందు కేజ్రీవాల్ గొంతు నొక్కివేయడానికే ఆయనను అరెస్టు చేశారని విమర్శించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..