Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?
Dasara Holidays 2024 | విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ సెప్టెంబరులో విద్యార్థులు చాలా రోజులు సెలవులు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో దసరా పండగ వస్తోంది. దీంతో దసరా పండగ సెలవుల కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వచ్చాయంటే చాలు హ్యాపీగా ఊళ్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ విజయదశమి పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు మొదలవుతాయి.ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మే 25న క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వగా, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగుతాయని, 2025 ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు, 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Dasara Holidays 2024 ఇదిలా ఉండగా పండుగలకు స్వగ్రామాలకు వెళ్లేవారికి ఈసారి రైలు టికెట్లు దొరకడం కాస్త కష్టంగానే మారింది. దసరా, దీపావళి పండగలు రాక ముందే సంక్రాంతికి రైలు టిక్కెట్లకు డిమాండ్ ఏర్పడింది. జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవులకు కూడా రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..