DA Hike : దీపావళి పండుగకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అంతకంటే ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi Govt) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (dearness allowance) ను 3 శాతం పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలైలో ఏడాదికి రెండుసార్లు డీఏను అంచనా వేసి, సర్దుబాటు చేసి, ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. చివరిసారి, మార్చిలో 4 శాతం ప్రకటించగా ఇది జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది.
దాదాపు 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి
ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 50 శాతం డీఏకు అర్హులు కాగా, పెన్షనర్లు తమ ప్రాథమిక పెన్షన్‌లో 50 శాతం డీఆర్‌ను పొందుతున్నారు. ప్రస్తుతం, కొత్త ప్రకటన తర్వాత, ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం నుంచి 53 శాతానికి పెరుగుతుంది. డీఏ పెంపు తర్వాత దాదాపు 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనాలు అందనున్నాయి. ప్రస్తుతం దీని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మరోవైపు దీపావళికి ముందు, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు, మొత్తం డిఎను 50 శాతానికి తీసుకువెళ్లారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎం సాయి తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులందరికీ ప్రస్తుతం 46 శాతం డీఏ లభిస్తుండగా, వారి డీఏను 4 శాతం పెంచుతున్నామని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి వారికి 50 శాతం డీఏ లభిస్తుంది.” సవరించిన 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు