Saturday, September 13Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?

Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?

Crime, తాజా వార్తలు
Baba Siddique Murder Case : 1990లలో జరిగిన రాజకీయ ప్రేరేపిత హత్యలు మ‌ళ్లీ క‌ల‌క‌లం సృష్టించాయి. దశాబ్దాల తర్వాత ముంబైలో జరిగిన బాబా సిద్ధిక్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. బాబా సిద్ధిఖీపై 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు షూటర్లు కాల్పులు జరిపారు. సిద్ధిఖీ NCP అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 48 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న సిద్ధిఖీ కొంతకాలం క్రితం ఎన్సీపీలో చేరారు. అయితే, మాజీ మంత్రి హత్యకు సంబంధ‌మున్న నిందితుల కుటుంబాలు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.ఈ హత్య కేసులో నిందితులు ముగ్గురూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. ఇద్దరు నిందితులు శివకుమార్ అలియాస్ శివగౌతమ్. ధరమ్‌రాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులు కాగా, గుర్మైల్ బల్జీత్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని కైతాల్ జిల్లా వాసి. ఈ ముగ్గురు యువకులు బాబా సిద్ధ...
Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్

Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్

Crime
cylinder on the railway tracks : ఉత్తర‌ఖండ్ లో మ‌రో రైలు ప్ర‌మాదానికి దుడ‌గులు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు.రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉద‌యం 6:35 గంట‌ల‌ సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా - ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి పంపించి ప‌రిశీలించ‌గా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్‌ మాస్టర్‌ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులక...
Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాట‌ర్‌, క‌రెంట్ క‌ట్‌

Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాట‌ర్‌, క‌రెంట్ క‌ట్‌

Crime
Vadodara | గుజరాత్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి (Vadodara Gangrape ) పాల్పడిన కేసులో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు అనుమానితుల ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీని డిస్‌కనెక్ట్ చేసింది. నిందితుల ఇండ్ల నిర్మాణాల‌కు మునిసిపాలిటీ నుంచి అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ నోటీసు అందించిన 72 గంటల తర్వాత అధికారులు తాజాగా క‌రెంటు, డ్రెయినేజీ క‌నెక్ష‌న్ ను క‌ట్ చేశారు.అక్టోబర్ 4న వడోదర నగర శివార్లలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 7న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసేందుకు బృందాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం వ‌డోద‌ర మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (VMC) నోటీసు ఇచ్చింది. దాని తర్వాత నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్‌లను గడువు ప్రకారం కట్ చేసినట్లు తెలిపారు.నిందితులు నిర్మించిన ఇళ్లకు బిల్డింగ్ పర్మిషన్ లేదని VMC నోటీసులో పేర్కొన్నారు. ఇంతలో, వ...
West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా

West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా

Crime
Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హ‌త్య‌ ఘటనలో షాకింగ్ ప‌రిణామాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార‌ దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్క‌సారిగా రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది.కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల హాస్పిట‌ల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్ట‌ర్ ...
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

Crime
Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది.ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ స్టేషన్ ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలకు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 324/2024కి సంబంధించి అరెస్టు చేశారు. విచారణలో, హుస్సేన్ అలియాస్ షాహిద్ అని పిలిచే మరొక నిందితుడి పేరును ప‌వ‌న్ కుమార్‌ సహాని బయటపెట్టాడు. ఈ క్లూ ఆధారంగా ATS నిఘా సమాచారాన్ని సేకరించి, చందౌలీలోని మొఘల్ సరాయ్‌లో అద్దెకు ఉంటున్న హుస్సేన్‌ను...
దసరా సెలవుకు ఊరెళుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

దసరా సెలవుకు ఊరెళుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

Crime
Dasara Holidays 2024 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దసరా సెలవులు వచ్చేశాయి.  పండుగ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ ఊరెళ్లకా ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే మన మనసంతా ఇక్కడే ఉంటుంది. దొంగలు పడకుండా పలు ముందస్తు జాగ్రత్తలు (Theft Prevention Tips)  తీసుకుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ధీమాగా ఉండొచ్చు..అయితే దసరాకు ఊరెళ్తే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మామూలు రోజుల కంటే దసరా వంటి సెలవుల్లో  పెద్ద సంఖ్యలో చోరీలు జరుగుతాయని చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే  దొంగలు రెక్కీ నిర్వహించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తారని హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాకే వెళ్లాలని చెప్పారు. లేదంటే తిరిగి వొచ్చే లోపు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ జాగ్రత్తలు పాటించండి.....
RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు

RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు

Crime
Ex-RG Kar Principal Sandip Ghosh | RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను గురువారం రద్దు చేసింది. ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో ఘోష్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 19న WBMC నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి మాజీ ప్రిన్సిపాల్ తొలగించారు. బెంగాల్ మెడికల్ యాక్ట్, 1914లోని వివిధ నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్‌ లైసెన్స్ ను రద్దు చేసింది. అంతకుముందు, RG కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ పరీక్షలు, లేయర్డ్ వాయిస్ విశ్లేషణ ప్రతిస్పందనలను CBI 'మోసపూరితమైనది' అని పేర్కొంది.భయంకరమైన కోల్‌కతా అత్యాచారం హత్య కేసులో షాకింగ్ వివరాలు నిరంతరం వెలుగు చూస్తునే ఉన్నాయి. ఘోష్ తోపాటు తాలాపూర్ స్టేషన్ SHO అభిజిత్ మోండల్ అరెస్టు తరువాత, వారి CBI రిమాండ్ నోట్‌లను మీడియా సంస్థ‌లు బ‌హిర్గ‌తం చేశాయి. సంఘట...
Kolkatha Rape Murder Case : దిగివచ్చిన మమత.. కీల‌క‌ పోలీసు, వైద్య‌ అధికారులపై వేటు..

Kolkatha Rape Murder Case : దిగివచ్చిన మమత.. కీల‌క‌ పోలీసు, వైద్య‌ అధికారులపై వేటు..

Crime
Kolkatha Rape Murder Case | ఆర్‌జి కర్ ఆసుపత్రి (RG Kar Hospital) అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యుల డిమాండ్ మేర‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను శుక్రవారం తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ-డాక్టర్‌కు న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేయడంతో వైద్యులతో సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్ నియామకాన్ని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తర డిప్యూటీ కమిషనర్‌ను కూడా బదిలీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.జూనియర్ డాక్టర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ రాజీనామాకు సిద్ధమని సమావేశంలో తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన కొత్త పోలీసు కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌, మెడిక...
Kolkata Rape Murder Case:  ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

Crime
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా అత్యాచారం-హత్య కేసులో నిందితుడిగా కూడా అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ రేప్ కేసు దర్యాప్తులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేసింది. సందీప్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్ష్యాల తారుమారు నివేదికల ప్రకారం, సందీప్ ఘో...
యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్

యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్

Crime
UP Rampur Incident | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మరో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులను సాజిద్ పాషా, ముదస్సిర్‌లుగా గుర్తించారు. రాంపూర్ జిల్లాలోని గ్రీన్ సిటీ హాస్పిటల్ అనే పేరున్న ఆసుపత్రికి పాషా డైరెక్టర్ గా ఉన్నారు. ఆగస్టు 31, 2024 నిందితులు మైనర్ బాధితురాలిని కోచింగ్‌కు తీసుకువెళతాననే నెపంతో కిడ్నాప్ చేశారు. నివేదికల ప్రకారం, నిందితులు యూపీ, ఉత్తరాఖండ్‌లలో లొకేషన్‌లు మారుస్తూనే ఉన్నారు. బందీగా ఉన్న మైనర్ బాలిక పై 5 రోజుల పాటు అత్యాచారం చేశారు. చివరకు విషయం తెలుసుకొని పోలీసులు బాధితురాలిని రక్షించారు.నివేదికల ప్రకారం.. మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు విచార‌ణ చేప‌ట్టారు. నిందితులు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తమ ర...