Saturday, September 13Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Crime
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు. ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిని విచారిస్తున్నామని, కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.  " వాహనాలు ఢీకొన్న ప్రభావం చాలా బలంగా ఉంది, కారు తలుపులను  కత్తిర...
ఘోర ప్రమాదం : బస్సులో మంటలు వ్యాపించి 25 మంది సజీవ దహనం

ఘోర ప్రమాదం : బస్సులో మంటలు వ్యాపించి 25 మంది సజీవ దహనం

Crime
మహారాష్ట్రలో శనివారం తెల్లారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. పూణెకు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు సహా 25 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్‌ నుంచి పూణెకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్రాజా సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. టైరు పగిలిపోవడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టిందని ఘటనలో ప్రాణాలతో బయటపడిన బస్సు డ్రైవర్ చెప్పాడు. కాగా తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బస్సులో సుమారు 33 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ...
రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా

రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా

Crime
ఇందుకోసం అమాయకుడి హత్య.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ప్లాన్ పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును అక్రమ పద్ధతిలో కాజేయాలని ప్లాన్ చేశాడు.. ఇందుకోసం తాను చనిపోయినట్లు సీన్ చేసేందుకు తన భార్యతో పాటు మరో నలుగురితో కలిసి కుట్ర పన్నాడు. తమ ప్లాన్ అమలు కోసం ఓ అమాయకుడిని హత్యచేశారు. చివరకు వీరి మాస్టర్ ప్లాన్ ను పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కు పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ కేసుకు సంబంధించి ఫతేఘర్ సాహిబ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) డాక్టర్ రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ వివరాలు వెల్లడించారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ తన ఫుడ్ చైన్ ఫ్రాంచైజీ వ్యాపారంలో నష్టాలు వచ్చి భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, జీవిత బీమా, ప్రమాద బీమాను క్లె...
కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్

కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్

Crime
[wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్ పొగ తాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇ టీవల వైరల్ అయిన విష యం తెలిసిందే. దీనిపై నె టిజన్లు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడంతో  పోలీసు అధికారులు కఠిన చర్యలకు దిగారు.ఓ వ్యక్తి గుర్రం నోరు మూసివేసి ముక్కు ద్వారా బలవంతంగా సిగరేట్ తాగించాడు. సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అయ్యారు. జీవనోపాధి కోసం ఉపయోగించే జంతువు పట్ల అమానవీయంగా ప్రవర్తించారంటూ దుమ్మెత్తిపోశారు. గుర్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంతువుల ఇంద్రియాలను మొద్దుబారేటట్లు చేసి అది మరింత కష్టపడి పనిచేయడానికే ఇలా చేశారని ఆరోపించారు.హిమాలయాల్లోన...
6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..

6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..

Crime
Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. " పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్‌లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన చిన్న-పరిమాణంలో ఉన్న తాబేళ్లను అధికారులు కనుగొన్నారు. అలాగే ప్రయాణీకులలో ఒకరి నుండి రూ. 57,441 విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.కస్టమ్స్ అధికారుల ప్రకారం, వన్యప్రాణులను భారతదేశంలోకి తీసుకువెళ్లడానికి దిగుమతి పత్రాలు లేదా లైసెన్స్‌లు ఈ ప్రయాణికుల వద్ద లేవు. అడవి త...
రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

Crime
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ....ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 కోట్లకు పైగా నగదు ఆరు బాక్సు ల్లో నిం పి. వాటిని పక్క ఇం టి టెర్ర స్ పైకి విసిరేశాడు. ఇది చూసిన అధికారులు ఆ డబ్బా లను క...
రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..

రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..

Crime
సుపారీ గ్యాంగ్ అరెస్టు హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో గిరబోయిన అంజయ్య(55), గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, డోలకొండ శ్రీకాంత్(22), బచ్చన్నపేట, జనగామ జిల్లా,  శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్(27). బచ్చన్నపేట ఉన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు.భూ వివాదం నేపథ్యంలో..కాగా ...
ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం

ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం

Crime
అర్ధరాత్రి బాలిక సహా ఇంటి ఓనర్ దారుణ హత్య..హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. పార్వతమ్మ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు చనిపోగా.. మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్న ఇంట్లో నివాసముంటోంది. పార్వతమ్మకు ఎవరూ లేకపోవడంతో తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియను ఇ...
138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!

138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!

Crime
ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు. విడాకుల కేసు వేసిన భార్య సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆ...
భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి

భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి

Crime
యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్‌తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని 38 ఏళ్ల భార్య సుమన్ పాల్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరూ చండీగఢ్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొరాదాబాద్ కు వలస వచ్చాడు. జూన్ 13- 14 మధ్య రాత్రి బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని మొరాదాబాద్(moradabad) రూరల్ పోలీసు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ తెలిపారు. భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారని దంపతుల బంధువులు, పిల్లలు ...