Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona Cases) రోజురోజుకు భారీగా పెరుగుతోంది.తాజాగా 800 కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 798 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక గురువారం ఒక్కరోజే ఐదు గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి జేఎన్.1 కొత్త వేరియంటే కారణమని తెలుస్తోంది..
తెలంగాణలోనూ కరోనా సమాచారంపై దాపరికం..
తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిప్తోంది ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. ఇప్పటి వరకు 60కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. గత రెండు రోజులుగా కరోనా లెక్కలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్.1 వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించినా.. నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
అయితే, రెండ్రోజుల క్రితం 1,333 మందికి పరీక్షలు చేయగా 8 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని బులెటిన్ లో వెల్లడించారు. ఆ రోజు నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 63 గా పేర్కొంటూ, 2 కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి వదిలేశారు. అయితే, శీతాకాలం సీజన్ కావడంతో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.
తిరుపతిలో నాలుగు కేసులు
తిరుపతి (Tirupati) నగరంలో నాలుగు కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. జలుబు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కరోనా సోకినవారిలో అనంతపురానికి (Ananthapuram) చెందిన ఓ వ్యక్తి, బెంగళూరుకు (Bengaluru) చెందిన ఒక మహిళ, తిరపతికి చెందిన దంపతులు ఉన్నారు. అనంతపురం, బెంగుళూరు నుంచి వచ్చిన కరోనా బాధితులను ఐడీహెచ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అలాగే, తిరుపతి దంపతులను వారి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. తిరుపతి రుయా ఆస్పత్రికి రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..