Corbevax Vaccine : హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి
Corbevax Vaccine : హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ దేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకా (Corbevax Vaccine) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్ ఫాంపై స్వదేశీయంగా రూపొందించిన తొలి దేశీ కొవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కోర్బీవ్యాక్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించింది. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ల కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందించింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల కోసం వినియోగించారు.
కాగా తమ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకంగా ఉందని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ తో తమ కంపెనీ కొవిడ్ 19 టీకాల ఉత్పత్తి వేగాన్ని పెంచనున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కట్టడి కోసం జరుగుతున్న పోరాటానికి తమ వంతు సాయం అందిస్తున్నామన్న విశ్వాసం పెరిందని తెలిపారు. చాలావరకు దేశాలు కొవిడ్ ను ఎదుర్కోవడంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అలాంటి ప్రజలకు తమ కోర్బీ వ్యాక్సిన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, నాణ్యమైన టీకాను అందించడమే తమ లక్ష్యమని అని, డబ్ల్యూహెవో అనుమతి లభిండం ఈ మార్గాన్ని సులభతరం చేస్తుందని మహిమ పేర్కొన్నారు.
28 రోజుల తేడాతో రెండు డోసుల్లో కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్ ను ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్స్ బీబీ1.5 వేరియంట్ ను ఢీకొట్టే నెక్ట్స్ జనరేషన్ కొవిడ్ వ్యాక్సిన్ ను కూడా బీఈ సంస్థ తయారు చేస్తోంది. ఆ టీకా పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం జంతువులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న అన్ని రకాల కొవిడ్ వేరియంట్ల ను ఆ నెక్ట్స్ జనరేషన్ వ్యాక్సిన్ ఎదుర్కుంటుందని బీఈ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..