Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు

Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు

Subsidy Gas : అతి త్వ‌ర‌లో మరో 2 గ్యారెంటీల (Congress Guarantees)ను అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29వ తేదీన‌ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 39.50 లక్షల మందికి ఈ ప‌థ‌కం కింద రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించనున్నారు. అయితే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు ప్ర‌భుత్వం స్పష్టం చేసింది.

రూ.500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించేందుకు రేవంత్ (Revanth Reddy) నేతృత్వంలోని ప్ర‌భుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 27 లేదా 29వ తేదీన పథకాన్ని ప్రారంభించ‌నుంది. ఈ మేరకు గ్యాస్ డీలర్లు అంద‌రూ సంసిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శాఖ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సివిల్‌ సప్లయ్స్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన‌ సమావేశంలో ప‌థ‌కం అమ‌లుపై చర్చించారు. గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు స‌మాచారం. తెలిసింది. రాష్ట్రంలో సుమారు 1.20 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు (Ration Card) ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన‌సాగుతున్న‌ ఇంటింటి సర్వే పూర్తయిన త‌ర్వాత అర్హుల సంఖ్య పెరిగే చాన్స్ ఉంది. పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారుల నుంచి కేవ‌లం రూ.500కే గ్యాస్‌ సిలిండర్ (Subsidy Gas) అందించాల‌ని పౌరసరఫరాల శాఖ డీలర్లకు సూచించింది.

READ MORE  KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

ఉచిత విద్యుత్ ప‌థ‌కం

మ‌రోవైపు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకాన్ని కూడా ఈనెల 27న లేదా 29న ప్రారంభించనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేసిన ఇంధన శాఖ సిబ్బంది.. అర్హుల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. అయితే వచ్చే నెల నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుంది. మార్చి క‌రెంటు బిల్లు జీరో బిల్లులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ రెండు పథకాలకు తొలుత అర్హులకు అందించాల‌ని ఆ తర్వాతనే మిగిలినవారు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం సూచించింది. తప్పులను సవరించుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే గృహజ్యోతి పథకం, రూ.500ల‌కు గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు క‌చ్చితంగా రేషన్ కార్డు ఉండి తీరాల‌ని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. ముందుగా రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వ‌ర్తింప‌జేయ‌నున్నారు.

READ MORE  Telangana Districts | మళ్లీ జిల్లాల పునర్విభజన.. ఆ18 జిల్లాలు రద్దవుతాయా?

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

3 thoughts on “Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *