
Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు
Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరిపి వారిని అరెస్టు చేశారు. అధికారులపై దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించిన నిందితులను తవాసి, కార్తీక్, కాళీశ్వరన్‌గా గుర్తించారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న 22 ఏళ్ల బాధితురాలు ఆదివారం తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి, వేరే ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత, అనుమానితులను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
Coimbatore Rape Case : తమిళనాడులో రాజకీయ తుఫాను
ఈ దారుణ ఘటన తమిళనాడులో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసిదంఇ. రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితి, మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార డిఎంకె ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి ప్రారంభించాయి. ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (ఇపిఎస్) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, “ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో క్రియాత్మకమైన పోలీసు దళం ఉందా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ ఆయన కోయంబత్తూరు, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు.తమిళనాడులో పోలీసు సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ బిజెపి సోమవారం కోయంబత్తూరులో నిరసనలు నిర్వహించి రాష్ట్రవ్యాప్త ఆందోళనలను ప్రకటించింది.
ఇది చాలా దిగ్భ్రాంతికరం : కె. అన్నామలై
ఈ నేరాన్ని “చాలా దిగ్భ్రాంతికరమైనది” అని అభివర్ణించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, “తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మహిళలపై ఇటువంటి నేరాలు పునరావృతమవుతూనే ఉన్నాయని విమర్శిచంఆరు. సామాజిక వ్యతిరేక శక్తులకు చట్టం లేదా పోలీసుల పట్ల ఎలాంటి భయం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు. . డిఎంకె మంత్రులు, పోలీసులు లైంగిక నేరస్థులను రక్షించే స్పష్టమైన ధోరణి ఉంది” అని అన్నారు. పోలీసు దళానికి కూడా బాధ్యత వహిస్తున్న స్టాలిన్ సిగ్గుతో తల దించుకోవాలి” అని ఆయన అన్నారు.
నేరాన్ని ఖండించిన నటుడు విజయ్, NHRC
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్, స్పందిస్తూ “శాంతిభద్రతలు, ప్రజా భద్రత ఎక్కడ? అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి గాయాలు ఇంకా మానకముందే సామూహిక అత్యాచారం జరిగింది” అని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్‌పర్సన్ కూడా ఈ సంఘటనను ఖండించారు, దీనిని “రాష్ట్ర పోలీసుల వైఫల్యం” అని అభివర్ణించారు.
మహిళలపై నేరాలు పెరగడాన్ని ప్రభుత్వం, పోలీసులు ఖండించారు విమర్శలకు ప్రతిస్పందనగా, అధికార డిఎంకె, సీనియర్ పోలీసు అధికారులు నేరస్థులపై వేగంగా, కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని, విచారణలు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.




