
CJI Justice Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (New Criminal Justice) అమలులోకి రావడాన్ని ప్రశంసించారు. భారతదేశం పురోగమిస్తోంది అనడానికి ఇది “స్పష్టమైన సూచన” అని అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని అందుకు భారతదేశం కూడా సర్వన్నద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యాధారాల చట్టం (BSA) పై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ ఈ కీలక సదస్సును శనివారం నిర్వహించింది.
ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు క్రిమినల్ జస్టిస్ పై భారతదేశం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కొత్త యుగంగా మార్చాయన్నారు. బాధితులకు రక్షణగా నిలిచేందుకు నేరాలపై సత్వర విచారణ జరిపేందుకు ఈ కీలక మార్పు చేయాలని సూచించారు. ఈ నూతన చట్టాలకు పార్లమెంట్ ఆమోదం తెలపడం దేశం పురోగమిస్తోందనడానికి సంకేతమని చెప్పారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించేందుకు ఈ కొత్త చట్టాలు అవసరమని సీజేఐ తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలతో పూర్తి ప్రయోజనం పొందేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు ఫోరెన్సిక్ నిపుణులు, పరిశోధకులకు శిక్షణ, మన కోర్టు వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
కాగా ఈ మూడు చట్టాలు (New Criminal Justice).. భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023; భారతీయ సాక్ష్యా అధినియం 2023, ఈ చట్టాలు మునుపటి క్రిమినల్ చట్టాలు అయిన ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 ను రీప్లేస్ చేశాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఈ క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..