Posted in

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

Chhattisgarh
Spread the love

Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్లు భద్రతాదళాలు తెలిపాయి. అలాగే భారీగా ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా  మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉందని భద్రతా దళాలు చెబుతున్నాయి. బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాది 170మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *