charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ (charlapalli railway terminal) లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల్లో నాలుగవ అతిపెద్ద టెర్మినల్ స్టేషన్‌గా నిలవనుంది. అంతేకాకుండా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 15 రైళ్లను నడిపించనున్నామని మంత్రిత్వ శాఖ X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
మొత్తం 9 ప్లాట్ ఫాంలు
charlapalli railway terminal దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఈ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ (స్టేషన్ కోడ్ – CHZ) లో తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు, 19 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జంట నగరాల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే టర్మినల్స్ ఉండగా అవి నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమం ఆయా స్టేషన్లపై భారం తగ్గించేందుకు చర్లపల్లి జంక్షన్ ను అత్యాధునిక హంగులతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్నారు.
Charlapalli Satellite Terminal Station, Telangana update:
Work Completed: 90%
Work in progress:
🚧Roof sheeting
🚧Turbo ventilator
🚧Side brickUpon completion it will:
🏢Be the 4th Terminal station in Twin Cities in Telangana
🚆Accommodate an additional 15 pairs of trains. pic.twitter.com/vyaWQjOZNR— Ministry of Railways (@RailMinIndia) July 16, 2024
ఇదిలా ఉండగా ఖరగ్‌పూర్-ఆదిత్యపూర్ 3వ లైన్ ప్రాజెక్ట్ పనుల పురోగతి గురించి కూడా రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 121.5 కి.మీ పొడవు ఉన్న ఖరగ్‌పూర్-ఆదిత్యపూర్ 3వ లైన్ పూర్తయిన తర్వాత, హౌరా-ముంబై ట్రంక్ రూట్‌లోని స్టీల్, పవర్ ప్లాంట్‌లకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌బర్న్ జిల్లాల్లోని ఆదిత్యపూర్ రూ. 1,312.44 కోట్ల అంచనా వ్యయం, రూ. 1,483.36 కోట్ల పూర్తి అంచనా వ్యయంతో, ఆగస్టు 2016లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఖరగ్‌పూర్ (నింపురా) మధ్య మూడో లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.