
Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది..
చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత చేరువ అయింది. చంద్రుడి కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని ప్రజలందరూ చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, డీడీ నేషనల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజ్ తో సహా ఇతర ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
మరింత జాగ్రత్త కోసమే..
అయితే రష్యా ప్రయోగించిన లూనా 25 మిషన్.. చంద్రయాన్-2 తరహాలో చివరి నిమిషంలో ఆదివారం క్రాష్ అయిన విషయం తెలిసిందే.. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్ 3 విఫలం కావొద్దని మనవాళ్లు కంకణం కట్టుకున్నారు. బహుశా అందుకే ల్యాండింగ్ ప్రక్రియను మరింత మృదువుగా పూర్తయ్యేందుకు.. సమయంలో ( Chandrayaan 3 Landing time) స్వల్ప మార్పులు చేశారు. నిజానికి ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు ల్యాండ్ కావల్సిన విక్రమ్ ల్యాండర్‌ను మరో 17 నిమిషాలు ఆలస్యం చేశారు. అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు ల్యాండ్ చేయాలని మన శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.