Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!
1 min read

Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!

Spread the love

Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల‌ వేగాన్ని పెంచ‌డంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేర‌కు లోక్‌సభ 2024 మేనిఫెస్టోలో మ‌ల్టీ హై-స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు కారిడార్‌లపై హామీని పొందుప‌రిచే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్లలో కీలక వాగ్దానంగా అనేక హెచ్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌లను చేర్చడాన్ని పార్టీ పరిశీలిస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
హై-స్పీడ్ రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త వెర్షన్ రైళ్ల కనెక్టివిటీని పెంచడంపై రాబోయే ఐదేళ్లలో పార్టీ ప్ర‌ధానంగా దృష్టిసారిస్తుంద‌ని పార్టీ సీనియర్ నాయకుడు ఆంగ్ల మీడియాకు చెప్పారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాషాయ పార్టీ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయలేదు.

ఈ ఏడాది మార్చిలో వచ్చిన మధ్యంతర బడ్జెట్‌లోనూ రైల్వే రంగం దృష్టి సారించింది. పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్, హై-ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్‌తో సహా మూడు ప్రధాన రైల్వే కారిడార్‌లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 40,000 సాధారణ బోగీలను వందే భారత్ బోగీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

2026లో బుల్లెట్ ట్రైన్ ప‌రుగులు

2019 లోక్‌సభ మేనిఫెస్టోలో కూడా హైస్పీడ్ రైళ్ల విస్తరణ గురించి బీజేపీ ప్రస్తావించింది. అయితే ప్రస్తుతం, ముంబై-అహ్మదాబాద్ హెచ్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌లో 508 కిలోమీటర్ల పొడవునా ఈ హైస్పీడ్ రైళ్ల‌పై ప్రభుత్వం పనిచేస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. దేశంలో బుల్లెట్ రైళ్లు 2026 లో ప్రారంభమ‌వుతాయ‌ని భావిస్తున్నారు.

ప్రస్తుతం గుజరాత్‌లో Bullet trains ప్రాజెక్టు పురోగతిలో ఉంది. దేశంలోనే మొదటి బుల్లెట్ రైలు అహ్మదాబాద్ నుంచి ప‌రుగులు పెట్ట‌నుంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రాజెక్ట్ 40% పూర్తయింది. ప్రాజెక్ట్‌లో గుజరాత్ భాగం 48.3% పూర్తి కాగా, మహారాష్ట్ర వైపు 22.5% నిర్మాణం పూర్తయిందని టైమ్స్ ఆఫ్ ఇండియా గ‌తంలోనే నివేదించింది.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ 508 కి.మీ పొడవునా 12 స్టేషన్లను కవర్ చేస్తూ గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్ల‌నుంది. ఈ కారిడార్‌లో బుల్లెట్ రైళ్ల ఫ్రీక్వెన్సీ రోజుకు 35 రైళ్లు/ఒక దిశలో ఉంటుంది, పీక్ అవర్స్‌లో 20 నిమిషాలు, నాన్-పీక్ అవర్స్‌లో 30 నిమిషాలు ఫ్రీక్వెన్సీ ఉంటుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *