Posted in

BSNL: మీ నెట్వర్క్ ప‌నిచేయ‌డం లేదా.. ? వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి

BSNL Recharge Plans
BSNL New Services
Spread the love

BSNL Network : రిలయన్స్ జియో. భారతీ ఎయిర్ టెల్‌, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుంచి వినియోగ‌దారులు క్ర‌మంగా BSNLవైపు మొగ్గు చూప‌డం ప్రారంభించారు. తక్కువ ధ‌ర‌లో రీచార్జ్ ప్లాన్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో లక్షలాది మంది ప్రజలు BSNL కు మ‌ళ్లారు.

BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను విస్త‌రిస్తోంది. దేశ‌వ్యాప్తంగా టవర్లను 4G కి అప్‌లోడ్ చేస్తోంది. చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం BSNLకి మారిన చాలా మంది విన‌యోగ‌దారులు నెట్‌వర్క్‌కు సంబంధించి అనేక‌ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే BSNL అనేక నగరాల్లో 4G సేవలను కూడా ప్రారంభిస్తూ వ‌స్తోంది. మీరు సిమ్‌ని బిఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉన్నప్పటికీ మీకు సరైన నెట్‌వర్క్ కనెక్టివిటీ అంద‌కపోతే దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.

ఇందులో ప్ర‌ధానంగా BSNL 4Gలో సరైన నెట్‌వర్క్ సిగ్న‌ల్స్‌ లేకపోవడం లేదా తక్కువ ఇంటర్నెట్ వేగం కంపెనీకి అందిన స్పెక్ట్రమ్ బ్యాండ్‌లు కారణంగా చెప్ప‌వ‌చ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే DoT ద్వారా BSNLకి 700MHz, 2100MHz రెండు స్పెక్ట్రమ్‌లు ఉన్నాయి. BSNL ఈ స్పెక్ట్రమ్ ద్వారా ప్రారంభ దశలో 4G సేవను ప్రారంభిస్తోంది. 2100MHz స్పెక్ట్రమ్ బ్యాండ్ సామర్థ్యం చాలా పరిమితంగా ఉంది. ఇది నెట్‌వర్క్‌లో అంతరాయానికి కారణం కావచ్చు.

మీరు BSNL Network 4G హై స్పీడ్ ఇంటర్నెట్ ను పొందాలనుకుంటే దీని కోసం 4G స్మార్ట్‌ఫోన్‌లో సిమ్‌ని ఉపయోగించాలి. BSNL అందుబాటులో ఉన్న 700MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ 5Gకి పూర్తిగా అనువుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో 5G స్మార్ట్‌ఫోన్‌లో మీరు BSNL సిమ్‌లో మంచి నెట్‌వర్క్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ స్పీడ్ ను పొందుతారు. మీకు BSNL 4G నుండి హై స్పీడ్ కనెక్టివిటీ కావాలంటే, మీరు మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేయాలి.

  • స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఆప్ష‌న్ ను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీరు నెట్‌వర్క్, ఇంటర్నెట్ ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి.
  • ఆ త‌ర్వాత‌ మీరు సిమ్ కార్డ్ ఆప్ష‌న్ ను ఎంచుకోండి.
  • మీ ఫోన్‌లో రెండు సిమ్ కార్డ్‌లు ఉంటే, మీరు మీ బిఎస్ఎన్ఎల్‌ సిమ్‌ని ఎంచుకోవాలి.
  • మీరు BSNL సిమ్‌ను క్లిక్ చేసిన వెంటనే, మీరు మ‌రిన్ని నెట్‌వర్క్ ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.
  • అందులో మీరు 5G/4G/LTE మోడ్‌ని ఎంచుకుని విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ ను ఆస్వాదించ‌వ‌చ్చు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *