BSNL వైపు వినియోగదారుల చూపు.. భారీగా పెరిగిన సబ్ స్క్రైబర్లు
1 min read

BSNL వైపు వినియోగదారుల చూపు.. భారీగా పెరిగిన సబ్ స్క్రైబర్లు

Spread the love

BSNL | రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా వొడఫోన్ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్లను ఒక్కసారిగా పెంచేయడంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు (BSNL) వినియోగదారులు పోటెత్తుతున్నారు. మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలూ ఓ వైపు యూజర్లను కోల్పోతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటూ పోతోంది. గత ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది.

జూలైలో ప్రధాన టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ధరల పెంచింది. దీంతో ఆ నెలలో మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.2 లక్షలు తగ్గింది. ఆగస్టు నెల వొచ్చేసరికి ఈ సంఖ్య 57.7 లక్షలుగా ఉంది. ఈ క్రమంలోనే జూలైలో కొత్తగా 29.3 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. ఆగస్టులో మరో 25.3 లక్షల మంది బిఎస్ ఎన్ ఎల్ కు మారారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్‌లను పెంచేది లేదని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవలే ప్రకటించడం గమనార్హం.  ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆగస్టులో 83 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ను అత్యధికంగా 40.2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కోల్పోగా,  ఎయిర్‌టెల్‌ 24.1 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 18.7 లక్షల చొప్పున వినియోగదారులను చేజార్చుకుంది. జూలైలో ఈ మూడు టెలికాం కంపెనీలు 38.6 లక్షల యూజర్లను కోల్పోయాయి.

సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచబోదని ఇటీవల BSNL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి ప్రకటించారు. కస్టమర్ సంతృప్తిని వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడంపై ప్రథమంగా దృష్టిసారించామని ఆయన చెప్పారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రకారం, దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన జియో ఆగస్టు 2024లో 4 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా 2.4 మిలియన్లు, 1.87 మిలియన్ల కస్టమర్లను కోల్పోయాయి. జూలై 2024లో, భారతీ ఎయిర్‌టెల్ 1,694,300 సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది, వొడాఫోన్ ఐడియా 1,413,910 సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. జియో 758,463 సబ్‌స్క్రైబర్‌ల క్షీణతను చవిచూసింది.

మార్కెట్ వాటా పరంగా, BSNL వాటా జూలై 2024లో 7.59% నుంచి ఆగస్టు 2024లో 7.84%కి పెరిగింది. ఇక ప్రైవేట్ టెల్కోలు మార్కెట్ వాటాలో క్షీణతను కొనసాగించాయి. జూలై 2024లో 40.68% ఉన్న రిలయన్స్ జియో.. ఆగస్టు 2024లో 40.53%కి పడిపోయింది. జూలై 2024లో 33.23% ఉన్న భారతీ ఎయిర్‌టెల్, ఆగస్టు 2024లో 33.07%కి పడిపోయింది. అదేవిధంగా, భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్, Vi జూలై 2024లో 18.46% ఉండగా అగస్టులో 18.39%కి తగ్గింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *