BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..
BSNL Live TV App : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టీవీ ప్రపంచంలోకి ప్రవేశించింది. BSNL తాజాగా ‘BSNL లైవ్ టీవీ’ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రారంభంలో Android TVలకు అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, దీని పూర్తి ఫీచర్లను ఇంకా ప్రకటించలేదు.
BSNL లైవ్ టీవీ యాప్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలను ఒకే CPE (కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్)గా అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. మీడియా నివేదిక ప్రకారం, కొత్త యాప్‌ను WeConnect అభివృద్ధి చేసింది BSNL కస్టమర్‌లకు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, BSNL ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దాని ధర చాలా తక్కువగానే ఉంది. దీని ప్రారంభ ధర నెలకు రూ.130గా నిర్ణయించింది. విశేషమేమిటంటే ఆండ్రాయిడ్ టీవీలలో ఈ సర్వీస్ సెట్-టాప్ బాక్స్ లేకుండా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సేవలు మార్కెట్లో BSNLతో పోటీ పడాల్సి ఉంటుంది.
5జీ సేవలను ప్రారంభించడమే లక్ష్యం
వచ్చే ఏడాది ప్రథమార్థం నాటికి దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు BSNL దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవల, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రచారం కింద BSNL 15,000 కంటే ఎక్కువ 4G సైట్‌లను సృష్టించిందని చెప్పారు. త్వరలో ఈ సైట్‌లను 5జీకి మార్చేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. ఇటీవల, టెలికాం డిపార్ట్‌మెంట్ (DoT) కూడా 5G SIM కార్డ్ ఫొటోను షేర్ చేసింది. ఆ తర్వాత 5G సేవ త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయతే ఇదే సమయంలో, చాలా చోట్ల నెట్‌వర్క్ సమస్యలను కూడా వేగంగా సరిదిద్దుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..