BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచర్లు.. ప్రయోజనాలు ఇవే..
BSNL Broadband Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకదానిని అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్నదాని కంటే నెట్ స్పీడ్, డేటా ప్రయోజనాలను పెంచేసింది. బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో రూ. 599 ప్లాన్ బాగా పాపులర్ అయిందది. అయితే ఈ ప్లాన్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేయడంతో ఇప్పుడు చందాదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
BSNL రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
BSNL 2020లో రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను ప్రారంభించినప్పుడు 60Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో పాటు 3.3TB నెలవారీ డేటాను అందించింది. కేటాయించిన డేటా వినియోగం తర్వాత, నెట్ స్పీడ్ 2Mbps కి తగ్గిపోతుంది.
BSNL Broadband Plan రూ. 599 ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ వినియోగదారులకు 2020 నుంచి ఆఫర్‌లో ఉంది. అయితే ఈ ప్లాన్ ఇప్పుడు 100Mbps స్పీడ్, 4TB నెలవారీ డేటాను అందించేలా అప్‌గ్రేడ్ చేసింది. కేటాయించిన డేటా వినియోగం తర్వాత, వినియోగదారులు ఇప్పుడు 4Mbps స్పీడ్ తో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయవచ్చు.
BSNL అందించే మరో రూ. 599 ప్లాన్‌ను ఫైబర్ బేసిక్ OTT ప్లాన్ అని పిలుస్తారు. ఇది 75Mbps వేగం, 4TB నెలవారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్‌కు వినియోగదారులకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది.
టీసీఎస్ తో జట్టు..
ఇదిలా ఉండగా BSNL ఈ ఏడాది ఆగస్టులో ‘మేడ్ ఇన్ ఇండియా’ 4G సేవను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కంపెనీ వర్గాల ప్రకారం.. 4G సేవ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. గరిష్టంగా 40 నుంచి 45 Mbps వేగంతో ఇంటర్నెట్ డేటా యాక్సెస్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 700 MHz, 2100 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లపై టెస్ట్ రన్ పరీక్ష నిర్వహించింది. అదనంగా, BSNL టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెలికాం రీసెర్చ్ ఆర్గనైజేషన్ C-డాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడిన 4G సర్వీస్ ను పంజాబ్‌లో ప్రారంభించింది. BSNL పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే దాని 4G నెట్‌వర్క్‌కు 8 లక్షల మంది కొత్త వినియోగదారులను ఆకర్షించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..