Friday, January 23Thank you for visiting

తాజా వార్తలు

Breaking News, National, State, Trending News Upadate

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Telangana, తాజా వార్తలు
Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...
Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఊహించన షాక్‌..

Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఊహించన షాక్‌..

Telangana, తాజా వార్తలు
Contract Employees : తెలంగాణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఊహించని విధంగా భారీ షాక్‌ తగిలింది. కొన్నేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ జారీ చేసిన జీఓ 16 నంబర్‌ను రద్దు చేసింది. ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని భావిస్తున్న‌ ఉద్యోగుల భవిష్యత్ మ‌ళ్లీ గందరగోళంలో పడింది. క్రమబద్ధీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  G.O 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్‌ ‌చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను (Contract Employees ) రెగ్యూలరైజ్ చేసింది.  అయితే తాజా హైకోర్టు తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ అయోమయంలో పడినట్లయింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించా...
DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..

DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..

తాజా వార్తలు
DA Hike : దీపావళి పండుగకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అంతకంటే ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi Govt) కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు తీపిక‌బురు చెప్పింది. మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (dearness allowance) ను 3 శాతం పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలైలో ఏడాదికి రెండుసార్లు డీఏను అంచనా వేసి, సర్దుబాటు చేసి, ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. చివరిసారి, మార్చిలో 4 శాతం ప్రకటించగా ఇది జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది. దాదాపు 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ల‌బ్ధి ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 50 శాతం డీఏకు అర్హులు కాగా, పెన్షనర్లు తమ ప్రాథమిక పెన్షన్...
Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?

Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?

Crime, తాజా వార్తలు
Baba Siddique Murder Case : 1990లలో జరిగిన రాజకీయ ప్రేరేపిత హత్యలు మ‌ళ్లీ క‌ల‌క‌లం సృష్టించాయి. దశాబ్దాల తర్వాత ముంబైలో జరిగిన బాబా సిద్ధిక్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. బాబా సిద్ధిఖీపై 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు షూటర్లు కాల్పులు జరిపారు. సిద్ధిఖీ NCP అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 48 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న సిద్ధిఖీ కొంతకాలం క్రితం ఎన్సీపీలో చేరారు. అయితే, మాజీ మంత్రి హత్యకు సంబంధ‌మున్న నిందితుల కుటుంబాలు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.ఈ హత్య కేసులో నిందితులు ముగ్గురూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. ఇద్దరు నిందితులు శివకుమార్ అలియాస్ శివగౌతమ్. ధరమ్‌రాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులు కాగా, గుర్మైల్ బల్జీత్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని కైతాల్ జిల్లా వాసి. ఈ ముగ్గురు యువకులు బాబా సిద్ధ...
Ratan Tata | దివికేగిన వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా కన్నమూత

Ratan Tata | దివికేగిన వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా కన్నమూత

తాజా వార్తలు
Ratan Tata | టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్, భారతదేశపు అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తలలో ఒకరైన రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 9) 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. డిసెంబర్ 28, 1937న జన్మించిన రతన్ నావల్ టాటా 1991 నుంచి 2012 వరకు భారతదేశంలోని అతిపెద్ద, విభిన్న వ్యాపార‌ విభాగాలు కలిగిన టాటా గ్రూప్‌కు ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆయ‌న అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టాటా ఛారిటబుల్ ట్రస్ట్‌లకు సైతం ర‌త‌న్ టాటా నాయకత్వం వహించారు. టాటా గ్రూప్ దాతృత్వ కార్యకలాపాలను రూపొందించడంలో ఆయ‌న‌ కీలక పాత్ర పోషించారు.తన 22 ఏళ్ల ఛైర్మన్‌గా ఉన్న కాలంలో, టాటా సంస్థ విస్తరణను గ్లోబల్ పవర్‌హౌస్‌గా పర్యవేక్షించారు. ర‌త‌న్ టాటా (Ratan Tata) నాయకత్వంలో, టాటా గ్రూప్ గణనీయమైన అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందింది. ముఖ్యంగా బ్రిటిష్ సంస్థ టెట్లీ టీని టాటా టీ 2000లో $450 మిలియన్లకు కొనుగోల...
PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

తాజా వార్తలు
PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇత‌ర‌ పథకాలను కేంద్రం మ‌రోసారి పొడిగించింది. 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కాల‌ కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేర‌కు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత...
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

తాజా వార్తలు
Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు క...
Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్..  నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..

Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..

తాజా వార్తలు
Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి ప‌నులు, మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా ప‌లు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్‌ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని సూచించింది. కాచిగూడ-మెదక్‌ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్ర‌క‌టించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..కాచిగూడ-నిజామాబాద్‌(07596), నిజామాబాద్‌-కాచిగూడ(07593), మేడ్చల్‌-లింగంపల్లి(47222), లింగంపల్లి-మేడ్చల్‌ (47225), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47235), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47236), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47237), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47238) మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47242), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47245), మేడ్చల్‌-సికిం...
ED raids | మంత్రి పొంగులేటికి  షాక్‌.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు

ED raids | మంత్రి పొంగులేటికి షాక్‌.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు

తాజా వార్తలు
ED raids | తెలంగాణ రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి ఈడీ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఈడీ అధికారులు నగరానికి చేరుకుని పొంగులేటి నివాసంలోపాటు కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ నుంచి నగరానికి చేరుకుని రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులకు సంబంధించిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో 16 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) , ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ కంపెనీ ఇటీవలే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ ...
Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Telangana, తాజా వార్తలు
Family Digital Card | రాష్ట్రంలోని ప్ర‌తీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పైలట్ ప్రాజెక్టు అమ‌లు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వ‌న్ డిజిటల్ కార్డ్` విధానాన్ని తెలంగాణ‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ల‌బ్ధిదారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతీఒక్కరి హెల్త్ పొఫైల్ త‌ప్ప‌ని...