Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో
Boy Returns As Monk | న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: తప్పిపోయిన కొడుకు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి రావడం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని ఒక గ్రామాన్ని కదిలించింది. సుమారు 22 ఏళ్ల సన్యాసిగా వచ్చి తల్లికి కనిపించాడు. (Boy Returns To Mother As Monk ) ఆమెను భిక్ష అడుక్కొని మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో తల్లి, కొడుకుల మధ్య భావోద్వేగ క్షలు కళ్లలు చెమర్చేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. 2002లో ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల పింకు తోటి పిల్లలతో కలిసి గోలీలు ఆడాడు. దీనిపై తండ్రి రతీపాల్ సింగ్, తల్లి భానుమతి మందలించారు. దీంతో ఆ బాలుడు అలిగి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.
Boy Returns As Monk : అయితే సన్యాసిగా మారిన పింకు 22 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్ అమేథీ జిల్లాలోని ఖరౌలి గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. సన్యాసిగా మారి సారంగిని వాయిస్తూ పాటలు పాడుతూ గ్రామస్తులను భిక్షమడిగాడు. అయితే ఆ సన్యాసి ఇంటి నుంచి పారిపోయిన పింకూనే అని అదే గ్రామంలో కొందరు బంధువులు గుర్తించారు. దీంతో వెంటనే ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారమివ్వగా హుటాహుటిన వారు ఆ గ్రామానికి చేరుకున్నారు.
మరోవైపు ఆ వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా ఆ సన్యాసిని తప్పిపోయిన పింకూగా తల్లి భానుమతి గుర్తించింది. కాగా తల్లీ, కుమారుడి కలయిక ఎంతోసేపు నిలువలేదు. తన తల్లి నుంచి భిక్ష స్వీకరిస్తేనే తన సాధువు జీవితానికి పూర్తి సార్థకత లభిస్తుందని అతడు వివరించాడు. దైవ నిర్ణయంతోనే తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోగలిగానని తెలిపాడు. తల్లి నుంచి భిక్ష తీసుకున్న తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా బతిమిలాడినా వినకుండా వారిని విడిచి ఆ గ్రామం నుంచి వెళ్లిపోయాడు.
కాగా, తన కుమారుడు పింకూను విడిచిపెట్టేందుకు అతడు ఉంటున్న మఠం రూ.11 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి రతీపాల్ సింగ్ ఆరోపించాడు. “నా జేబులో ₹ 11 లేదు , నేను ₹ 11 లక్షలు ఎలా చెల్లించగలను ? ” అంటూ పింకూ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.
20 साल बाद जोगी के भेष में भिक्षा मांगने अपने ही घर पहुंचा बेटा, मां ने लिया पहचान।
अमेठी से एक चौंका देने वाला मामला सामने आया है, आपको बता दें कि यहां 20 साल पहले घर से भागा बेटा अचानक जोगी के भेष में अपने घर पहुंचा तो उसे देखकर सब लोग हैरान हो गए।#Amethi #UttarPradesh pic.twitter.com/zaVpWjykmn
— UP Tak (@UPTakOfficial) February 7, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
💐💐