
‘బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇప్పుడు నెలకు రూ.15,000 లభిస్తుంది, ఇది గతంలో రూ.6000 ఉండగా ఇప్పుడు భారీగా పెంచారు.
అంతేకాకుండా, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే, మరణించిన వ్యక్తి భార్యకు నెలకు రూ. 10,000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. అలాంటి మహిళలు గతంలో నెలకు రూ. 3000 పొందేవారు.దీనికి సంబంధించిన సూచనలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంబంధిత శాఖకు తెలియజేశారు.
“బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ రూ.6,000కి బదులుగా రూ.15,000 నెలవారీ పెన్షన్ అందించాలని శాఖకు సూచనలు ఇచ్చామని ముఖ్యమంత్రి నితిష్ కుమార్ తెలిపారు. అదనంగా, ‘బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం’ కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి జీవితాంతం రూ.3,000కి బదులుగా రూ.10,000 నెలవారీ పెన్షన్ అందించాలని ఆదేశించామని తెలిపారు.జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం, సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. జర్నలిస్టులు తమ జర్నలిజాన్ని నిష్పాక్షికంగా నిర్వహించడానికి, పదవీ విరమణ తర్వాత గౌరవంగా జీవించడానికి మేము మొదటి నుండి జర్నలిస్టుల సౌకర్యాలను జాగ్రత్తగా చూసుకుంటున్నాము” అని సీఎం నితీష్ Xలో పోస్ట్ చేశారు.
కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జెడియు ఈ చర్యను మాస్టర్ స్ట్రోక్‌గా పరిగణించారు.
ఇతర ప్రధాన హామీలు
- సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, వితంతువు మహిళలకు నెలవారీ పెన్షన్లు 400 రూపాయల నుండి 1100 రూపాయలకు పెంచారు.
- ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. జూలై బిల్లు నుండే వినియోగదారులు దాని ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు.
- బీహార్ ప్రభుత్వం (Bihar Govt) రాబోయే ఐదు సంవత్సరాలలో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలను ప్రకటించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.