Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు
పాట్నా: బీహాల్ (Bihar) లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసు వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ వాహనాన్ని కొంత దూరం వరకు తోయించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆ నలుగురిని పోలీస్ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు.
ఇంతలో పోలీస్ వాహనంలో ఇంధనం అయిపోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు.. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నిందితులు పోలీసు వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం తోసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
पुलिस की गाड़ी में पेट्रोल खत्म, कैदियों ने मारा धक्का
नवगछिया से 4 कैदी पेशी के लिए आए भागलपुर, कोर्ट के 500 मीटर पहले गाड़ी रुक गई pic.twitter.com/IawDYq2uBU
— FirstBiharJharkhand (@firstbiharnews) February 3, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..