Wednesday, July 30Thank you for visiting

Job Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

Spread the love

Bhatti Vikramarka On Job Notification |  నిరుద్యోగులకు ప్రభుత్వం (Congress Governament) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu )  వెల్లడించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్‎లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాకలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పదోన్నతులు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్స్ ఇచ్చామని తెలిపారు..

క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. కరెంట్ ట్రిప్ కాకుండా అదనంగా ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యుత్ సమస్యలు, ఫిర్యాదుల కోసం ;h/ai 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నదని, దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

త్వరలో  పొలంబాట

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గాను త్వరలో పోలం బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పొలాల వద్ద వంగిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న కరెంటు తీగ‌లను సరిచేయనున్నట్లు తెలిపారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ కంచెలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. లైన్ మెన్ లకు ప్రజలతో నేరుగా ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయని, కాబట్టి వారి ప్రవర్తన బాగుండాలని సూచించారు.  సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని అందుకు అనుగుణంగా, నైపుణ్యాలను పెంచుకొని ముందుకు పోవాలని చెప్పారు.  విద్యుత్ శాఖకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సిబ్భందికి ఆధునిక సాంకేతిక శిక్ష‌ణ‌ అందించాలని , ఇందుకు శిక్షణ కళాశాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో సిబ్బంది, అధికారులకు పదోన్నతులు కల్పించామని, ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నియామక ప్రకటన చేస్తామని తెలిపారు. ఎటువంటి విద్యుత్ ఫిర్యాదులకైనా 1912 కి ఫోన్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలను కోరారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *