Bhatti Vikramarka | విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..
Deputy CM Bhatti Vikramarka Comments : గత ప్రభుత్వం ప్రతీ శాఖను అప్పుల్లో ముంచేసిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా రుణాలు చేసి వెళ్లారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును ఆయన శనివారం సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్’ (Bhadradri Power Station), ‘యాదాద్రి పవర్ స్టేషన్’ (Yadadri Power Station) నిర్మిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేశారు. రాష్ట్రాన్ని భయంకరమైన దుస్థితికి తీసుకొచ్చారు. అందుకే అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పక్కా ప్రణాళికతో అడుగులు వేయాల్సి ఉంటుందని తెలిపారు ప్రతీ శాఖలోనూ తాజా పరిస్థితులపై సంబంధిత అధికారులతో క్రమంతప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులు తెలుసుకుంటున్నామని తెలిపారు.
సింగరేణికి రూ.19 వేల కోట్ల బకాయిలు
తమతోనే కరెంట్ అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను అప్పుల్లోకి నెట్టివేశారని, సింగరేణికి రూ.19వేల కోట్లు బకాయి పడ్డారని భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై సమగ్ర సమాచారం సేకరించి ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.81,514కోట్ల అప్పులు చేసిందని, ప్రభుత్వం నుండి డిస్కంలకు రూ.28వేల కోట్ల బకాయిపడి ఉన్నామని వివరించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ.50వేల కోట్ల అప్పు ఉందన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హాని కలగకుండా నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..