Friday, August 29Thank you for visiting

Mohan Bhagavat | భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్

Spread the love

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగడం సహజమే.. కానీ అది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, స్వచ్ఛంద సహకారంతో జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకం విధించిన రోజున, మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
“నిజమైన స్వదేశీ అంటే బలవంతం కాదు, ప్రపంచంతో స్వచ్ఛంద సహకారం. అవసరమైతే మాత్రమే దిగుమతులు చేసుకోవాలి. మిగతా అవసరాలను దేశీయ ఉత్పత్తుల (Swadeshi products) ద్వారానే తీర్చుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉపన్యాసంలో భగవత్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక విధానాలు బలవంతం కాకుండా సహకారంపై ఆధారపడాలని సూచించారు. “లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైందీ, ఐక్యరాజ్యసమితి కూడా సంఘర్షణలను నివారించడంలో తడబడుతోంది. నేటి ప్రపంచం అసహనం, మతోన్మాదం, ‘వోకిజం’ (Woke ideology) వంటి భావజాలాల వల్ల కల్లోలాన్ని ఎదుర్కొంటోంది” అని ఆయన హెచ్చరించారు.

భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాహ్య ఒత్తిడులు లేకుండా ప్రపంచంతో తన స్వంత నిబంధనల ప్రకారం ఆర్థిక వ్యవస్థను (Indian economy) నిర్మించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

రెండో ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడంలో లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైందని, అలాగే ఐక్యరాజ్యసమితి కూడా సంఘర్షణలను అడ్డుకోవడంలో కష్టపడుతోందని అన్నారు. నేటి ప్రపంచం అంచున ఉందని, పెరుగుతున్న అశాంతి, అసహనం, మతోన్మాదం సమాజంలోని విలువలను క్షీణింపజేస్తున్నాయని హెచ్చరించారు. “వోకిజం” వంటి భావజాలం కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోందని, పెద్దలు, యువత ఇద్దరినీ కలవరపెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

మతాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం

మతాన్ని కేవలం ఆచారాలు లేదా ఆచరణలకు మాత్రమే పరిమితం చేయకూడదని, దానిని ‘ధర్మం’గా అర్థం చేసుకోవాలని. ధర్మం వైవిధ్యాన్ని అంగీకరించి సమతుల్యతను బోధించే సార్వత్రిక సూత్రమని ఆయన తెలిపారు.

మహాత్మా గాంధీ ఒకప్పుడు పేర్కొన్న “ఏడు సామాజిక పాపాలు” నేటి సమాజంపై మరింత ప్రభావం చూపుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు క్రమశిక్షణ, ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉండాలని, రాజ్యాంగం, చట్టాలు, దేశ నియమాలను గౌరవించాలని భగవత్ పిలుపునిచ్చారు. అసంతృప్తి పరిస్థితుల్లో శాంతియుత నిరసనలే సరైన మార్గమని, అరాచక శక్తుల ప్రేరేపణకు లొంగవద్దని ఆయన స్పష్టం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *