Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా పిలిచే తన ప్రతిష్టాత్మకమైన ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ దాదాపుగా పూర్తికావ‌చ్చింది. రెండు ప్రధాన కారిడార్లతో 44.65 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

బెంగళూరు మెట్రో రూ.15,611 కోట్ల ఫేజ్-3 ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-3 లో రెండు ఎలివేటెడ్ కారిడార్లతో మొత్తం 31 మెట్రో స్టేషన్లతో 44.65 కి.మీ మేర విస్త‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం వేచి ఉంది.

మొదటి కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుకు పశ్చిమ వైపున 32.15 కి.మీ.కు పైగా విస్తరించి, JP నగర్ నాల్గవ దశను కెంపపురానికి కలుపుతూ, 22 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ లైన్‌కు కూడా కలుపుతుంది. మగడి రోడ్డులోని హోసహళ్లి నుంచి కడబ్‌గెరె వరకు 12.5 కిలోమీటర్ల మేర ఉన్న రెండో కారిడార్‌లో తొమ్మిది స్టేషన్లు ఉంటాయి.

READ MORE  పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

కారిడార్ 1 ప్రాథమికంగా ఔటర్ రింగ్ రోడ్డు పశ్చిమ వైపున వెళ్తుంది. ప్రధానంగా స్టేషన్ నిర్మాణం, రోడ్డు విస్తరణ ప్రాజెక్టులకు ప్రైవేట్ భూమి అవసరం. ప్రారంభంలో కారిడార్ 1 కోసం 1,29,743 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 777 ప్రైవేట్ ఆస్తులు గుర్తించారు. అయితే మూడు స్టేషన్‌ల కోసం అదనపు భూమి అవ‌స‌ర‌మైంది. అందులో JP నగర్ 5వ దశ, కామాఖ్య బస్ డిపో, హోసకెరెహల్లి.

“కారిడార్ 1 కోసం ల్యాండ్ ప్లాన్ ఖరారు చేశారు. అయితే మూడు స్టేషన్లకు అదనపు భూమి కోసం మాకు ప్ర‌తిపాద‌న వచ్చింది. మేము ఆస్తులను గుర్తించాం. త్వరలో కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు (KIADB) ద్వారా ప్రాథమిక నోటిఫికేషన్‌ను పంపుతాం” అని BMRCL జనరల్ మేనేజర్ (భూ సేకరణ) MS చన్నప్పగౌడర్, డెక్కన్ హెరాల్డ్ నివేదించారు.
గుర్తించబడిన ఆస్తులలో వాణిజ్య నిర్మాణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా, పెద్ద సంస్థలు లేదా వారసత్వ భవనాలు లేవు. భూసేకరణ ఖర్చులు ప్ర‌స్తుతం లెక్కిస్తున్నారు. భూ వినియోగ విధానాలలో మార్పుల కారణంగా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) అంచనాలకు భిన్నంగా ఉండవచ్చు, చన్నప్పగౌడర్ పేర్కొన్నారు.

READ MORE  New Railway Line | ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త రైల్వే లైన్ పనులపై అధ్యయనం..

BMRCL ఫేజ్ 3, తోపాటు 3A కింద మెట్రో-కమ్-ఫ్లైఓవర్‌ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తోంది. ఫేజ్ 3లో, రెండు డబుల్ డెక్ ఫ్లైఓవర్‌లు ఉండవచ్చు: ఒకటి జెపి నగర్ 4వ ఫేజ్ నుంచి హెబ్బాల్ (29.2 కి.మీ), మరొకటి హోసహళ్లి నుండి కడబాగెరె (11.45 కి.మీ.) వరకు ఉంటుంది. ఫేజ్-3 ప్రాజెక్ట్ 2028 నాటికి పూర్తవుతుంది. ఫేజ్-3లో 2051 నాటికి రోజుకు సగటున 9.12 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు.

READ MORE  దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

One thought on “Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *