Bengaluru Business Corridor | బెంగళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..
Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది. 21,000 కోట్ల భారీ భూసేకరణ వ్యయానికి సబ్సిడీ ఇవ్వడం ఈ చర్య లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.27,000 కోట్లు. పెరిఫెరల్ రింగ్ రోడ్డు నగర శివారు చూట్టూ ఒక వలయంగా నిర్మంచనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శివారు ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచేండం దీని లక్ష్యం. ఈ కారిడార్ 10 ప్రధాన జంక్షన్లు, 100 కి పైగా చిన్న కూడళ్ల మీదుగా సాగుతుంది. హేసరఘట్ట రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, వైట్‌ఫీల్డ్ రోడ్, చన్నసంద్ర రోడ్, హోసూర్ రోడ్ వంటి కీలక ప్రదేశాలలో వ్యూహాత్మకంగా 16 ఫ్లైఓవర్‌లను నిర్మించనున్నారు.
బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) పదేపదే ప్రాజెక్ట్ కోసం బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలమైంది. అంతేకాకుంఆడ ప్రైవేట్ కంపెనీలు భూసేకరణ ఖర్చులను భరించడానికి ఇష్టపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో, ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి మంత్రి డికె శివకుమార్ పిఆర్ఆర్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై సమీక్షిస్తూ కొత్త ఫైనాన్సింగ్ ఎంపికలను అన్వేషించాలని BDAని ఆదేశించారు. కొత్త ప్రతిపాదన ప్రకారం, BDA బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOOT) మోడల్‌ని ఉపయోగించి ప్రైవేట్ ప్లేయర్‌లకు ప్రాజెక్ట్‌ను అప్పగిస్తుందని ది హిందూ నివేదించింది.
వాణిజ్య అభివృద్ధి ప్రణాళికలో PRR ప్రాజెక్టు కు సంబంధించి రైట్ ఆఫ్ వే (RoW)ని మరింత తగ్గిస్తుంది. మొదట PRR 100-మీటర్ల RoWతో రూపొందించారు. ఇందులో ఎనిమిది ప్రధాన లేన్‌లు, ఇరువైపులా మూడు సర్వీస్ లేన్‌లు ఉన్నాయి. అయితే గతేడాది దీన్ని 75 మీటర్లకు తగ్గించారు. కొత్త ప్రతిపాదనలో 55-60 మీటర్లకు కుదించారు. ఎనిమిది ప్రధాన లేన్లు, ఒక వైపు మాత్రమే సర్వీస్ రోడ్డు ఉంటుంది. మిగిలిన 40-45 మీటర్లను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు.
ఈ ప్రతిష్టాత్మక Bengaluru Business Corridor ప్రాజెక్ట్ 16 ఫ్లైఓవర్‌లు, 10 ఓవర్‌పాస్‌లు, 12 అండర్‌పాస్‌లను కలిగి ఉంది. ఇది బెంగళూరు రవాణా నెట్‌వర్క్ దశను మార్చివేస్తుంది. మరోవైపు ఈ ప్లాన్ లో చిక్కటోగూర్ సరస్సు, గుంజూర్ సరస్సు, జరకబండే సరస్సు వంటి ప్రముఖమైన వాటితో సహా ఏడు నీటి వనరులపై వంతెనలు ఉన్నాయి, ఇవి అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తాయి. ట్రాఫిక్ చిక్కులను పరిష్కరించడానికి, ప్రాజెక్ట్ ఆరు క్లోవర్‌లీఫ్-రకం ఓవర్ బ్రిడ్జిలను కలిగి ఉంది. ఇది రద్దీ లేకుండా సమర్థవంతమైన క్రిస్‌క్రాసింగ్‌కు పరిష్కారాన్ని అందిస్తుంది.
భవిష్యత్ అవసరాల కోసం..
BDA వెల్లడించిన డిజైన్‌లను పరిశీలిస్తే.. 100-మీ వెడల్పు గల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో గ్రీన్ స్పేస్‌లు, యుటిలిటీస్, అండర్ గ్రౌండ్ కేబుల్‌లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు డ్రైన్‌లు ఉన్నాయి.
ప్రధాన క్యారేజ్‌వే, ఎనిమిది లేన్‌లను కలిగి ఉంది. రెండు వైపులా సర్వీస్ రోడ్‌లు ఉంటాయి, భవిష్యత్తులో మెట్రో ప్రాజెక్ట్‌తో అనుసంధానం కావడానికి విస్తృతమైన స్థలం కేటాయిస్తారు. ఈ ప్రాజెక్ట్ హోసూర్ రోడ్- తుమకూరు రోడ్ మధ్య 65.95 కి.మీ పొడవు ఉంది, మదనాయకనహళ్ళి దగ్గర అదనంగా 3.4 కి.మీ, హెబ్బగోడి దగ్గర 4.08 కి.మీ.లు ప్రస్తుతం ఉన్న రోడ్లను PRR నెట్‌వర్క్‌లోకి సజావుగా అనుసంధానించడానికి ఈ ప్రాజెక్ట్ కవర్ చేస్తుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..