వీడియో: ఆటో డ్రైవర్.. చాకచక్యంగా మోసం చేశాడు.. పోలీసులకు చిక్కాడు..
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. బంగ్లాదేశ్ వ్లాగర్‌ని చాకచక్యంగా మోసం చేసి కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతాకు చెందిన ఒక వ్లాగర్ ఎక్స్ (ట్విటర్ )లో షేర్ చేసి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేయడంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.
కోల్‌కతా వ్లాగర్ మృత్యుంజయ్ సర్దార్ ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. “బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అతడి స్నేహితురాలితో కలిసి బెంగళూరు పర్యటనకు వచ్చారు. బెంగళూరు ప్యాలెస్’ ను సందర్శించిన తరువాత ఓ ఆటో ఎక్కగా ఆటో డ్రైవర్ చార్జీ చెల్లించే విషయంలో మోసం చేశాడు.
బంగ్లాదేశ్ కు చెందిన వ్లాగర్.. MD ఫిజ్ మాట్లాడుతూ.. తాను, అతని స్నేహితురాలు బెంగళూరులో ఆటోలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆటోడ్రైవర్‌తో మాట్లాడగా.. ఆటో మీటర్ చార్జీతో ఎక్కించుకునేందుకు అంగీకరించాడు. వారు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, ఛార్జీ రూ.320 చూపించింది. వ్లాగర్ తన పర్సు నుంచి రూ.500 నోటును తీసి డ్రైవర్‌కి ఇచ్చాడు. డ్రైవరు ఆ నోటును చాకచక్యంగా షర్టులో దాచిపెట్టి ఎండీ.ఫిజ్ రూ.100 నోటును ఇచ్చినట్లు చూపించాడు
వ్లాగర్ అతనికి మరో రూ. 500 నోటు ఇచ్చాడు. అతను వీడియోను ఎడిట్ చేయడం ప్రారంభించినప్పుడు అతను మోసపోయానని గ్రహించాడు.
“చూడండి, నేను నా వాలెట్‌ని తీయకముందే డ్రైవర్ మరో చేతిలో రూ.100 నోటు దాచి ఉంచాడు” అని ఫిజ్ వీడియోలో తెలిపారు.” రూ.100 నోటు తీసి రూ.320 అని చెబుతున్నప్పుడు అతను నా రూ. 500 నోటును తీసుకుని తన స్లీవ్‌లో పెట్టుకుంటున్నాడు చూడండి.” అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. “మొదట నేను రూ.500 నోటు ఇచ్చికూడా రూ.100 ఇచ్చినట్లు భావించి అతడికి నేను రెండో రూ. 500 నోటు ఇచ్చాను,” అన్నారాయన.
కాగా ఈ వీడియోను చూసిన తర్వాత బెంగుళూరు పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి, ఎక్స్‌లో అప్‌డేట్ ఇచ్చారు. “ఆ ఆటో డ్రైవర్‌ను తదుపరి చర్య కోసం సదాశివనగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు” అని పోలీసు శాఖ తెలిపింది.
Bangladeshi blogger and his girlfriend were traveling – “Bengaluru Palace”. A local auto driver cheated them. This is how we treat foreigners ?? please take action. https://t.co/mdhXwqRp9h @CPBlr @BlrCityPolice@DCPWestBCP #Bangalore #Karnataka pic.twitter.com/WIuf29KyqJ
— Mrityunjay Sardar (@VloggerCalcutta) September 5, 2023